Share News

వక్క మార్కెట్‌ నిర్మాణానికి సహకరించండి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:07 AM

వక్క మార్కెట్‌ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయంలో హోంమంత్రి అనిత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

వక్క మార్కెట్‌ నిర్మాణానికి సహకరించండి

మడకశిర, జూలై 26: వక్క మార్కెట్‌ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయంలో హోంమంత్రి అనిత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మడకశిర అర్బన పోలీస్‌ స్టేషనకు ఎస్‌ఐ పోస్ట్‌ ను, మడకశిర నియోజకర్గంలో ని ఐదు మండలాల పోలీస్‌ స్టేషన ల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని, వాహనాలు లేవని హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు ను కలసి నియోజకవర్గంలోని అమరాపురం లో వక్కమార్కెట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టు రైతులకు రాయితీలు, ప్రోత్సాకాలను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇచ్చారని, మరలా వాటిని కొనసాగించాలని కోరారు. ఎంపీఈఓలను అంతర్‌ జిల్లా బదిలీల నుంచి తప్పించాలని కోరారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమరాపురం కేంద్రంగా వక్క మార్కెట్‌ నిర్మాణానికి జీఓ.ఆర్‌టి, నంబరు. 301 మంజూరు చేస్తూ రూ.3.66 కోట్ల నిధుల్ని అప్పట్లో నే కేటాయించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మార్కెట్‌ పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వక్కమార్కెట్‌ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మల్బరీ రైతులను కూడా గత ప్రభుత్వం పూర్తి నిర్తక్ష్యం చేసిందని, వారిని ప్రోత్సహించాలని కోరారు. మల్బరీ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందజేసే సబ్సిడీని పెంచాలని కోరారు. రైతుకు రూ.50 చొప్పన ప్రోత్సాహక నగదును అందించాలని, సబ్సిడీతో రైతులకు ఉపకరణాలను అందించి ఆదుకోవాలని వారు మంత్రిని కోరారు.

Updated Date - Jul 27 , 2024 | 12:07 AM