Share News

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Sep 26 , 2024 | 11:58 PM

నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా
Speaking MLA MS Raju

మడకశిర(అమరాపురం), సెప్టెంబరు 26: నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో పాటు ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన సందర్భంగా మా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నాగోనపల్లి గ్రామంలో మండల కన్వీనర్‌ గణేష్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వక్కమార్కెట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తమ్మడేపల్లి పంచాయతీకి రూ.50లక్షలతో సీసీ రోడ్డు మంజూరు, ఓఆర్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏసీ నాగరాజు, ఏపీఎం తిప్పన్న సమక్షంలో మహిళలకు చెక్కులను అందజేశారు. విద్యాభివృద్ధి నిధులను అర్ధంతరంగా ఆగిన భవనాలకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇళ్ల వద్దకు వెళ్లి స్టిక్కర్లను అతికించారు. ఎంపీడీఓ భాస్కర్‌, మండల కన్వీనర్‌ గణేష్‌, జయకుమార్‌, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, మంజునాథ్‌, వి.ఎం.పాండురంగప్ప, శివరుద్రప్ప, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి, జయరామప్ప, మారుతీప్రసాద్‌, రామచంద్రప్ప, నవీనకుమార్‌, రఘు, లింగరాజు, చెన్నప్ప, గౌడరంగప్ప, గురుసిద్దప్ప, హనుమంతు, ఎంపీటీసీ ఓంకార్‌ స్వామి, శ్రీరామ్‌, కృష్ణమూర్తి, తిప్పేస్వామి పాల్గొన్నారు.

మొక్కల పెంపకం ప్రారంభం: మండలంలోని మద్దనకుంట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం అవెన్యూ ప్లాంటేషన కింద మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మె ల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Sep 26 , 2024 | 11:58 PM