Share News

అనంతను మరోసారి గెలిపిస్తే సర్వనాశనమే

ABN , Publish Date - May 09 , 2024 | 12:26 AM

అనంత వెంకట రామిరెడ్డిని మరోసారి గెలిపిస్తే నగరం సర్వనా శనం అవుతుందని కూటమి అనంత అర్బన ఎమ్మె ల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ పేర్కొన్నారు.

అనంతను మరోసారి గెలిపిస్తే సర్వనాశనమే
దగ్గుబాటి ప్రచారంలో పాల్గొన్న కేఎం జకీవుల్లా

అనంతపురం అర్బన, మే 8: అనంత వెంకట రామిరెడ్డిని మరోసారి గెలిపిస్తే నగరం సర్వనా శనం అవుతుందని కూటమి అనంత అర్బన ఎమ్మె ల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం ఆరో డివిజన పరిధిలోని నీరుగంటి వీధి, ఖాజా నగర్‌ల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 20 నిమిషాల వర్షానికే నగరంలోని ప్రధాన రోడ్లన్నీ వర్షపు నీరు, డ్రైనేజీ కాలువల నీటితో నిండిపోయాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి, నాలుగు సార్లు ఎంపీ, ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డి చేసిన అభివృద్ధి ఇదేనా అని నిలదీశారు. గత ఎన్నికల ముందు మూడు నెలలకే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తీసుకొ స్తామని, అలా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయ నని ప్రజలకు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. గతంలో వర్షాలొచ్చి నడి మివంక పరిసర ప్రాంతాలన్నీ మునిగిపో యాయని, ఆ సమయంలో నడిమివంకకు ఇరువైపులా వాల్స్‌ ఏర్పాటు చేసి ఇళ్లల్లోకి నీరుకాకుండా చేస్తానని హామీ ఇచ్చారని, మళ్లీ వర్షాలు వస్తున్నా ఇప్పటి దాకా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఒక సారి అవకాశం ఇస్తే.. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల వర్తింపుతో పాటు నగర అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ స్వరూప, రవికాంత రమణ, విశాలాక్షి, వెంకటస్వామి, రామకృష్ణ, నెట్టెం బాలకృష్ణ, మేదర వెంకటేష్‌, వసుంధర, జనసేన నాయకులు విజయకుమార్‌, సరిత, మంజుల పాల్గొన్నారు.


ప్రముఖుల ప్రచారం: అనంతపురం నగరంలోని 11వ డివిజన పరిధిలో బుధవారం కూటమి అనంత అర్బన అభ్యర్థి సతీమణి దగ్గుబాటి శ్రీలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే అనంతపురం నగరంలోని 27వ డివిజనలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, 8వ డివిజనలో టీఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపు వెంకటేష్‌, 13వ డివిజనలో టీడీపీ కురబ సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ కురబ నారాయణ స్వామి, చెరుకూరి శివ, 16వ డివిజన పరిధిలోని వెంకటరెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్‌ రహమత బీ, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌రావు, సుధా, మహి, రామాంజి, సాదిక్‌ ప్రచారం చేశారు.


జకీవుల్లాతో కలిసి ప్రచారం: అనంతపురం నగరం 8వ డివిజన పరిధిలోని టీడీపీ రాష్ట్ర నాయకులు కేఎం జకీవుల్లాతో కలిసి దగ్గుబాటి ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. జకీవుల్లా మద్దతునిచ్చి ప్రచారంలో భాగస్వా మ్యులు కావడంతో జోష్‌ కనిపించింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌, రాష్ట్ర నాయకులు జకీవుల్లాలతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు.


ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం

టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా ఉండగా ఉంటామని దగ్గుబాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక కొత్తూరు అమ్మవారిశాలలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తనతోపాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయ ణకు ఒక అవకావం ఇవ్వాలని, అధికారంలోకి రా గానే పేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వ డంతో పాటు పక్కాఇళ్లు నిర్మించిఇస్తామనిహామీ ఇచ్చారు.


బుల్లితెర నటుల ప్రచారం

అనంతపురంరూరల్‌: మండలంలోని ఎ.నారా యణపురం పంచాయతీలో బుల్లితెర నటులు సందడి చేశారు. దగ్గుబాటి ప్రసాద్‌కు మద్ధతుగా కార్తీక దీపం ఫేమ్‌ అర్చన, సీరియల్‌ నటులు భవానీ, విక్రమాదిత్య రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. దగ్గుపాటి ప్రసాద్‌ సతీమణి శ్రీలక్షితో కలసి తపోవనం సర్కిల్‌ నుంచి నారాయణపురం వరకు రోడ్డు షో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బల్లాపల్లవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:27 AM