Share News

Collector : తల్లీబిడ్డలు చనిపోతే మీదే బాధ్యత

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:42 PM

ప్రసవం సమయంలో మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. ఆస్పత్రులలో ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోయినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో సంభవించిన మరణాలు, కారణాల గరించి ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివిధ కారణాలను చెప్పగా.. కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాల విషయంలో నిర్లక్ష్యాన్ని ...

Collector : తల్లీబిడ్డలు చనిపోతే మీదే బాధ్యత
Collector Vinod Kumar speaking at the review of the medical department

వైద్యులు, సిబ్బందికి కలెక్టర్‌ వార్నింగ్‌

అనంతపురం టౌన, జూలై 25: ప్రసవం సమయంలో మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. ఆస్పత్రులలో ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోయినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో సంభవించిన మరణాలు, కారణాల గరించి ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివిధ కారణాలను చెప్పగా.. కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. గర్భం దాల్చింది మొదలు అన్ని వివరాలు నమోదు చేస్తున్నామని, వైద్య పరీక్షలు, సేవలు అందిస్తున్నామని కలెక్టర్‌ గుర్తు


చేశారు. కాబట్టి గర్భిణులకు ఏ సమస్య ఉన్నా ముందే తెలిసిపోతుందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మరణాలు ఎందుకు సంభవిస్తాయని ప్రశ్నించారు. మాతాశిశువుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోకుండా ఏవో కారణాలు చెబితే ఎలా అని మండిపడ్డారు. ‘ఇది మొదటిసారి కాబట్టి మీరు చెప్పింది వింటున్నా. మళ్లీ మరణాలు సంభవిస్తే క్షమించేది లేదు..’ అని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య సిబ్బంది అన్న తేడా లేకుండా శిక్షలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లాలో మాతాశిశు మరణాలు సంభవించకుండా చూడాలని అన్నారు.

కుష్టును పారదోలండి..

కుష్టును పూర్తిస్థాయిలో నిర్మూలించాలని, జిల్లాను కుష్ఠు రహితంగా మార్చాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కుష్టు కేసుల గుర్తింపునకు, వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరాతీశారు. కుష్టుపై ప్రజలలో ఉన్న అపోహాలను తొలగించాలని సూచించారు. ప్రతిఒక్కరినీ పరీక్షించాలని, లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ అయినోళ్లకు వెంటనే వైద్యసేవలు అందించాలని, కోర్సు ప్రకారం మందులు వాడేలా, జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలలో డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డీసీహెచఎ్‌స డాక్టర్‌ రవికుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇకపై సచివాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలలోను ప్రజా ఫిర్యాదుల వేదికను నిర్వహిస్తామని కలెక్టరు గురువారం ప్రకటించారు. ప్రతి సోమవారం అక్కడ ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని అన్నారు. మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన ద్వారా కూడా ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి సమస్యలపై అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే సోమవారం నుంచి జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమౌతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 25 , 2024 | 11:42 PM