Share News

GURUPURNIMA : సాయినాథ్‌ మహరాజ్‌కీ జై

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:49 PM

జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గురువులకు గురువుగా భావించే కొలిచే షిర్డీ సాయిబాబా ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో సాయినామస్మరణ ప్రతిధ్వనించింది. స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కాగడహారతులు, పల్లకీసేవలు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాదిమందికి అన్నదానం చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో సాయినాథున్ని కొలువుదీర్చి బాణసంచా ...

GURUPURNIMA : సాయినాథ్‌ మహరాజ్‌కీ జై
Flower offering to Sainath at Marutinagar Saibaba Temple

అంబరాన్నంటిన గురుపౌర్ణమి సంబరాలు

అనంతపురం కల్చరల్‌, జూలై 21: జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గురువులకు గురువుగా భావించే కొలిచే షిర్డీ సాయిబాబా ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో సాయినామస్మరణ ప్రతిధ్వనించింది. స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కాగడహారతులు, పల్లకీసేవలు


నిర్వహించారు. మధ్యాహ్నం వేలాదిమందికి అన్నదానం చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో సాయినాథున్ని కొలువుదీర్చి బాణసంచా పేలుళ్లు, కళాకారుల విన్యాసాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. పౌర్ణమి నేపథ్యంలో ప్రతి ఆలయంలోనూ సామూహిక సాయిసత్యవ్రతాలను విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా చాలా ఆలయాలవద్ద పెద్దఎత్తున అన్నదాన వినియోగాలు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 11:49 PM