Share News

road accident రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:54 AM

మండలంలోని టీ వీరాపురం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మన్న(52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య సత్యమ్మ, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

road accident రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

రాయదుర్గంరూరల్‌, అక్టోబరు 1: మండలంలోని టీ వీరాపురం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మన్న(52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య సత్యమ్మ, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.


విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బొమ్మన్న భార్య సత్యమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో కర్ణాటక ప్రాంతంలోని గౌరసముద్రం జాతరకు వెళ్లారు. స్వగ్రామానికి మంగళవారం తి రిగి వస్తుండగా.. మార్గంమధ్యలోని టీ వీరాపురం వద్ద ఎదురుగా మరో బైక్‌ రావడంతో ప్ర మాదవశాత్తూ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ప్రమాదంలో బొమ్మన్న అక్కడికక్కడే మృతి చెం దాడు. సత్యమ్మకు, టీ వీరాపురానికి చెందిన ఆంజనేయులుకు, రాయదుర్గం మండలం వేపరా లకు చెందిన గురుస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారి ముగ్గురినీ రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 02 , 2024 | 07:39 AM