Share News

POLYSET : ప్చ్‌.. పాలిసెట్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:53 AM

పాలిసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో కేవలం 7,819 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,759 మంది అర్హత సాధించారు. జిల్లాలో వందలోపు ర్యాంకులు ఇద్దరికి మాత్రమే వచ్చాయి. వీరు కూడా ఐఐటీకి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి పాలిటెక్నిక్‌ చదవాలన్న ధ్యేయంతో ఉన్న ఏ ఒక్కరికీ వెయ్యి లోపు ర్యాంకు రాలేదని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదనేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు అంటున్నారు. ...

POLYSET : ప్చ్‌.. పాలిసెట్‌
Sweet for Shanmukha Sharma

7,819 మందికి 6,759 మంది అర్హత

డిప్లొమాకు ఐదేళ్లలో తగ్గిన ఆదరణ

ర్యాంకులు సాధించినా.. లక్ష్యం వేరే..

వైసీపీ పాలనలో ఉద్యోగాలు కరువు

అనంతపురం సెంట్రల్‌, మే 8: పాలిసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో కేవలం 7,819 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,759 మంది అర్హత సాధించారు. జిల్లాలో వందలోపు ర్యాంకులు ఇద్దరికి మాత్రమే వచ్చాయి. వీరు కూడా ఐఐటీకి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి పాలిటెక్నిక్‌ చదవాలన్న ధ్యేయంతో ఉన్న ఏ ఒక్కరికీ వెయ్యి లోపు ర్యాంకు రాలేదని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదనేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు అంటున్నారు.


ఇంజనీరింగ్‌ డిప్లొమా పూర్తిచేస్తే చిన్న, చిన్న ఉద్యోగాలు తప్పకుండా వస్తాయన్న నమ్మకం ఉండేది. పాలిటెక్నిక్‌ కోర్సులకు పోటీపడేవారు. కానీ ఐదేళ్లుగా సీన రివర్స్‌ అయింది. పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిచేసినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కోర్సు పట్ల విద్యార్థులు నిరాసక్తత చూపుతున్నారు. ఈ ప్రభావం ఈ ఏడాది పాలిసెట్‌-2024పై స్పష్టంగా కనిపించింది.

బాలికలదే పైచేయి

పాలిసెట్‌ ఫలిగాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొత్తం 3,191 మంది బాలికలకుగాను 2,827 మంది, 4,628 మంది బాలురకుగాను 3,932 మంది అర్హత సాధించారు. బాలికలు 88.59 శాతం, బాలురు 84.96 శాతం అర్హత సాధించారు. రాష్ట్రస్థాయిలో షణ్ముక శర్మ 51, రోహిత సాయి వర్మ 59, సాహితి 160 ర్యాంకు సాధించి, జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొత్తం విద్యార్థుల అర్హత శాతం 86.44 కాగా, రాష్ట్రంలో జిల్లా 18వ స్థానంలో నిలించింది.


ఐఐటీ బాంబేలో చదవాలి..

జేఈఈ మెయిన్సలో మంచి ర్యాంక్‌ సాధించి, ఐఐటీ బాంబేలో ఈసీఈ చదవాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. అమ్మ స్వరూప రాణి ప్రభుత్వ ఉపాధ్యాయని. నాన్న సురేష్‌ శర్మ ప్రైవేట్‌ సంస్థలో సీనియర్‌ ఎలకీ్ట్రషియన. మా నాన్న అమ్మను చదివించి ప్రభుత్వ ఉపాధ్యాయనిగా చేశారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను.

- షణ్ముఖ శర్మ, 51 ర్యాంకు

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం..

ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. మాది అనంతపురం. అమ్మ సంధ్యారాణి గృహిణి. నాన్న సుదర్శన రాజు డీఆర్‌డీఏలో ఏపీఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా నేను ప్రజలకు మెరుగైన సేవ చేయాలన్నది మా అమ్మ, నాన్న ఆకాంక్ష. వారి కలలను నిజం చేస్తాను. పదో తరగతిలో 592 మార్కులు సాధించాను. పాలిసెట్‌ 59వ ర్యాంక్‌ సాధించడం ఆనందంగా ఉంది.

- రోహిత సాయి వర్మ, 59వ ర్యాంకు

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 09 , 2024 | 12:55 AM