Share News

ముగిసిన పోస్టల్‌ పోల్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:33 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ కీలక ఓటర్ల పోలింగ్‌ ముగిసింది. జిల్లాలో 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేశారు.

ముగిసిన పోస్టల్‌ పోల్‌
ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులు

అనంతపురం టౌన, మే 8: పోస్టల్‌ బ్యాలెట్‌ కీలక ఓటర్ల పోలింగ్‌ ముగిసింది. జిల్లాలో 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేశారు. వీరిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగనవాడీలు 23,900 మంది ఉన్నారు. నాలు గో తేదీ నుంచి పోలింగ్‌ మొదలైంది. జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా స్పందించి.. పోలింగ్‌ గడువును రెండు రోజులు పెంచి.. 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులకు కూడా ఎన్నికల కమిషన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు అవకాశం కల్పించింది. ఆ శాఖల వారు ఈ నెల 10వ తేదీ వరకు ఓటు వేయవచ్చని నోడల్‌ అధికారి, డీపీఓ ప్రభాకరరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫెసిలిటేషన సెంటర్ల వద్దనే వారు కూడా ఓటు వేయాలని సూచించారు.

Updated Date - May 09 , 2024 | 12:33 AM