Share News

ప్రకాశ.. నియోజకవర్గాన్ని వీడేందుకు సిద్ధమా..!

ABN , Publish Date - May 09 , 2024 | 12:28 AM

ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి ఓటమి అర్థమైందని, అందుకే జూన 4న రాప్తాడు నియోజకవర్గాన్ని ఖాళీ చేసేందుకు సూట్‌ కేసులు సర్ధుకొని సిద్ధంగా ఉన్నాడని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు.

ప్రకాశ.. నియోజకవర్గాన్ని వీడేందుకు సిద్ధమా..!
పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు

రాప్తాడు, మే 8: ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి ఓటమి అర్థమైందని, అందుకే జూన 4న రాప్తాడు నియోజకవర్గాన్ని ఖాళీ చేసేందుకు సూట్‌ కేసులు సర్ధుకొని సిద్ధంగా ఉన్నాడని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. మండలం లోని బోగినేపల్లి, పాలచెర్ల, గంగలకుంట, రాప్తాడులో పార్లమెంట్‌ అభ్యర్థి పార్థసారధి, దర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌తో కలిసి బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 వేల కోట్లతో అభివృద్ధి చేశానని, తోపులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మంజూరైన రోడ్లు, బ్రిడ్జి ఎందుకు నిర్మించలేదన్నారు. వారి సొంత గ్రామానికి రోడ్డు వేయించని తోపులు.. అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు ఆవేశపడి తొడలు కొడితే... తన మనువడితో తొడ కొట్టిస్థానని హెచ్చరించారు. పార్థసారధి మాట్లాడుతూ ఐదేళ్లలో ప్రకా్‌షరెడ్డి దౌర్జన్యాలు, అరాచకాలు చేశాడని అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాప్తాడు అభివృద్ధి అటుంచి... సర్వనాశనం కావడం తథ్యమని అన్నారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ.. తమ లక్ష్యం రాప్తాడు అభివృద్ధి... అరాచక ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డిని తొక్కడమేనని అన్నారు. తోపు సోదరులు కమీషన్ల రూపంలో రైతుల పొట్ట కొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ఇనచార్జ్‌ దర్మవరపు మురళి, కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, గంగలకుంట రమణ, సర్పంచ తిరుపాలు, గోనిపట్ల శీనా సాకే జయరాముడు, నారాయణస్వామి, బీరన్న, కిష్టా పాల్గొన్నారు.


వైసీపీ నుంచి టీడీపీలోకి..

అనంతపురంరూరల్‌ : రాప్తాడు నియోజక వర్గంలోని ప్రాంతాల నుంచి పలువురు వైసీపీ నాయకులు అనంతపురం పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో పరిటాల శ్రీరామ్‌ సమక్షంలో పార్టీలోకి చేశారు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట, చిన్నంపల్లి పంచాయతీల్లోని రమణకొట్టాల నుంచి దండోరా రమణ ఆధ్వర్యంలో 150 కుటుం బాలు టీడీపీలోకి చేరాయి. సిద్ధార్థ సమక్షంలో ఆత్మకూరు మండలం సింగంపల్లి, బి.యాలేరు. తలుపూరు, పి.కొత్తపల్లి, చెన్నేకొ త్తపల్లి మండలం వెల్దుర్తి, జంగాలపల్లి గ్రామాల నుంచి 30 కుటుంబాలు, మేడాపురం, పాలచెర్ల గ్రామం నుంచి 10 కుటుంబాలు పరి టాల సునీత సమక్షంలో టీడీపీలోకి చేరారు.


చెన్నేకొత్తపల్లి : మండలంలోని మేడాపురం లో పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో తాను మంత్రిగా ఉండి మేడాపురం చెరువుకు నీటిని తెప్పించానని గుర్తు చేశారు. తన భర్త పరిటాల రవీంద్ర ప్యాక్షనను పూర్తీగా నిర్మూలించగా... నేడు తోపుబ్రదర్స్‌ మళ్లీ అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రచారంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, రామసుబ్బమ్మ, అంకే అమరేంద్ర, పసల పెద్దవెంకటరాముడు, లడ్డు లక్ష్మయ్య, పసల వెంకటేశ, జగదీశ, రాము, పక్కీరప్ప, రాజా,శేషయ్య, శ్రీరాములు, నాగేలి సూర్యనారాయణ, చీమలఅనిల్‌, తిరుపాల్‌, నారాయణ, నరసింహమూర్తి, నాగేంద్ర పాల్గొ న్నారు. అలాగే మండలంలోని ఎర్రజిన్నన్న గారిపల్లి, పల్లెన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌నారాయణచౌదరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 09 , 2024 | 12:28 AM