Share News

DMHO : మెరుగైన వైద్య సేవలందించండి : డీఎంహెచఓ

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:12 AM

ప్రజలకు అందు బాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందిం చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎం హెచఓ) డాక్టర్‌ ఈబీ దేవి వైద్యులు, సి బ్బందికి సూచించారు. డీఎంహెచఓ బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచసీలో పలు రికార్డులను పరిశీలిం చారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పా టించాలని, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ముఖ్యంగా గార్లదిన్నె పీ హెచసీ వైద్యులు ఇద్దరు ఒక గదిలో, యర్రగుంట్ల వైద్యాధికారి మరో గదిలో ఉంటూ వైద్య సేవలం దించాలని సూచించారు.

DMHO : మెరుగైన వైద్య సేవలందించండి : డీఎంహెచఓ
DMHO EB Devi is checking the records

గార్లదిన్నె, జూలై 24 : ప్రజలకు అందు బాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందిం చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎం హెచఓ) డాక్టర్‌ ఈబీ దేవి వైద్యులు, సి బ్బందికి సూచించారు. డీఎంహెచఓ బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచసీలో పలు రికార్డులను పరిశీలిం చారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పా టించాలని, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ముఖ్యంగా గార్లదిన్నె పీ హెచసీ వైద్యులు ఇద్దరు ఒక గదిలో, యర్రగుంట్ల వైద్యాధికారి మరో గదిలో ఉంటూ వైద్య సేవలం దించాలని సూచించారు. ముగ్గురూ ఒకే గదిలో ఉంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ముఖ్యంగా గార్లదిన్నె పీహెచసీ లోనే ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ల్యాబ్‌ను, మం దుల గదిని పరిశీలించారు. రోజూ సు మారు 50 వరకు వైద్య పరీక్షలు చేస్తామ ని ల్యాబ్‌ టెక్నిషియన కిరణ్‌ తెలిపారు. పీహెచసీలో ఏవైనా సమస్యలుంటే తెల పాలని వైద్యాధికారి గౌతమికి సూచిం చారు. పీహెచసీలో స్టాప్‌ నర్సులు ము గ్గురు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉండడంతో ఇబ్బందిగా ఉందని వైద్యాధి కారి డీఎంహెచఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లుతానని డీఎంహెచఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు గౌతమి, మంజుల, దిలీప్‌ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 25 , 2024 | 12:12 AM