Share News

CPM: రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:54 PM

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం ఒకటవ నగర కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో కార్డుదారులతో కలసి చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.

CPM: రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి
CPM leaders protesting in front of the Urban Tehsildar's office

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 12: ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం ఒకటవ నగర కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో కార్డుదారులతో కలసి చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన బియ్యాన్ని కొందరు డీలర్లు, అధికారులతో కుమ్మక్కై అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారన్నారు. అర్బన పరిధిలో ఉన్న స్టోర్లలో ఇప్పటికే బియ్యం, సరుకులు 74 శాతం సరఫరా చేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారన్నారు. కొన్ని స్టోర్లలో 25 శాతానికి మించి సరఫరా కాలేదన్నారు. బియ్యం చక్కెర అక్రమంగా అమ్ముకున్నారని మండిపడ్డారు. 58,326 మందికి రేషన కార్డులు ఉండగా ఇప్పటి దాకా 44,067 మందికి మాత్రమే బియ్యం సరఫరా చేశారన్నారు. నాయకులు వెంకటనారాయణ, ప్రకాష్‌, మసూద్‌, వలీ, రాజు, జీవా, సీన, వెంకటేష్‌, అంజి, డేవిడ్‌, రవి, బాషా, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:54 PM