Share News

BK : వచ్చేది కూటమి ప్రభుత్వమే..

ABN , Publish Date - May 24 , 2024 | 11:50 PM

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని టీడీపీ కూటమి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థ సారథి అన్నారు. ఆయన శుక్రవారం హిందూ పురం మండలంలోని బిట్‌ కళాశాల, గురుకుల పాఠశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. అనంతరం బీకే మా ట్లాడుతూ... కేంద్రంలో ఎనడీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయ మన్నారు.

BK : వచ్చేది కూటమి ప్రభుత్వమే..
BK Parthasarathy and leaders are coming to inspect the strong room

ఎంపీ అభ్యర్థి బీకే

స్ర్టాంగ్‌ రూమ్‌ల పరిశీలన

హిందూపురం, మే 24: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని టీడీపీ కూటమి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థ సారథి అన్నారు. ఆయన శుక్రవారం హిందూ పురం మండలంలోని బిట్‌ కళాశాల, గురుకుల పాఠశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. అనంతరం బీకే మా ట్లాడుతూ... కేంద్రంలో ఎనడీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయ మన్నారు. ప్రజలు చైతన్యవంతులై అరాచక పాలనను అంతమొదించారన్నారు. ఈ ఐదేళ్లలో తాము పడిన అవస్థలు, బాధలను దృష్టిలో పెట్టుకుని వైసీపీని ఓడిం చాలని కసిగా ఓటువేశారన్నారు.


ఇప్పటికే కూటమి గెలుస్తుందని ప్రచారం జరుగుతుండడం కొందరు వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. అందుకే రాష్ట్రంలో పలుచోట్ల అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఐదే ళ్ల పాటు వైసీపీ నేతలు సాగిం చిన అరాచకాలను చూసి, ఇక ఆ పార్టీని సాగనంపాలని ప్రజలు ని ర్ణయించుకుని కూటమి అభ్యర్థుల కు ఓటు వేశారన్నారు. అయితే ఇంకా కొంతమంది వైసీపీ నాయ కులు భ్రమలో బతుకుతున్నారని వారి భ్రమలు, ఊహలు పది రోజుల్లో పటాపంచలవుతాయ న్నారు. ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఎన్నికల లెక్కింపు ప్రశాం తంగా జరిపేందుకు ఎన్నికల కమిషన, పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయాల ని విజ్ఞప్తి చేశారు. బీకే వెంట ఈడీపీ నాయకులు సిద్దలింగప్ప, దేవనరసింహప్ప, యువశేఖర్‌, అశ్వత్థరెడ్డి, నీలకంఠా రెడ్డి, బెల్లాల చెరువుచంద్ర, మనోహర్‌, రవి, శంకర్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 24 , 2024 | 11:50 PM