Home » Election
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
బ్రిటిషర్ల తరహాలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ఈ దేశ సంపదైన నీరు, అడవులు, భూములను కొల్లగొట్టిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని టీడీపీ కూటమి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థ సారథి అన్నారు. ఆయన శుక్రవారం హిందూ పురం మండలంలోని బిట్ కళాశాల, గురుకుల పాఠశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్ రూమ్‌లను పరిశీలించారు. అనంతరం బీకే మా ట్లాడుతూ... కేంద్రంలో ఎనడీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయ మన్నారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం(మే 25న) ఓటింగ్ జరగనుంది.
అమరావతి మే 24: జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెబ్ ఎక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్‌సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు.
పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతం తెలపడం, దాన్ని వెబ్సైట్లో పెట్టడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందువల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పింది. ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలియజేసే ఫామ్ 17(సి)ని బయటపెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది. వాటిని బయట పెడితే
చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు.
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.