Share News

elections : ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ABN , Publish Date - May 09 , 2024 | 12:20 AM

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో మె ౖక్రో అబ్జర్వర్ల (సూ క్ష్మపరిశీలకుల) పాత్ర కీలకమైనదని ఎన్నికల సాధారణ పరిశీలకుడు అన్భుకుమార్‌ పేర్కొన్నారు.

elections : ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

పుట్టపర్తి మే 8: ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో మె ౖక్రో అబ్జర్వర్ల (సూ క్ష్మపరిశీలకుల) పాత్ర కీలకమైనదని ఎన్నికల సాధారణ పరిశీలకుడు అన్భుకుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం మైక్రోఅబ్జర్వర్లకు ఒకరోజు ఓరియేంటేషన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ ఆయా పోలింగ్‌కేంద్రాలలో ఓటింగ్‌ రహస్యంగా ప్రశాంతంగా జరగాలన్నారు.


ఓటర్‌ మినహా ఎవరినీ పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికతో పోలింగ్‌ రోజుకు సిద్ధం కావాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆరుణ్‌బాబు మాట్లాడుతూ.. ఓటింగ్‌ ప్రారంభానికి మందు 90 నిముషాల ముందే మైక్రోఅబ్జర్వర్లు పోలింగ్‌ స్టేషన్లలో డాలన్నారు.మాక్‌పోల్‌ను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. కార ్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, సచివాలయ నోడల్‌ అధికారి శివారెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ సూర్యనారాయణ, ఈడీటీ మైనుద్దీన పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 09 , 2024 | 12:20 AM