Share News

KARGIL DIVAS: కార్గిల్‌ అమరుల సేవలు మరువలేనివి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:20 AM

కార్గిల్‌ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆర్ట్స్‌ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

KARGIL DIVAS: కార్గిల్‌ అమరుల సేవలు మరువలేనివి
Ex-servicemen and guests starting the rally by waving the flag

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై 26: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆర్ట్స్‌ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దివాకర్‌రెడ్డి, జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి తిమ్మప్ప, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నేటి యువత దేశం కోసం పాటుపడాలన్నారు. భారతదేశంలోని ప్రతిఒక్కరూ కార్గిల్‌ యుద్ధంలో మరణించిన సైనికులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎనసీసీ డాక్టర్‌ రంగనాథ్‌, ఎనఎ్‌సఎ్‌స విష్ణుప్రియ, బృందామేడం, ప్రభుత్వ హైస్కూల్‌ ఎనసీసీ నాగేంద్ర, మాజీ సైనికుల సంఘం నాయకులు ఉమామహేశ్వరరావు, తిమ్మారెడ్డి, గొల్ల ఈశ్వరయ్య, సంజీవకుమార్‌, జంగంశెట్టి సురేష్‌, మహమ్మద్‌ గౌస్‌, హుస్సేన, తలమర్ల కృష్ణ, మణికుమార్‌, పెంచలయ్య, సుబ్రహ్మణ్యం, సిద్దన్న, నాగరాజు, బాబా, శివశంకర్‌, మహమ్మద్‌ ఇర్షాద్‌ పాల్గొన్నారు.


కార్గిల్‌ యుద్దవీరులకు సన్మానం

అంతపురం సెంట్రల్‌: కార్గిల్‌ యుద్ధంలో పోరాటం చేసిన మాజీ సైనికులను శుక్రవారం బీజేవైఎం రాయలసీమ జోనల్‌ ఇనచార్జ్‌ సూర్యప్రకా్‌షరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ రక్షణకోసం ప్రతి భారతీయుడు సైనికుడిగా పనిచేసేందుకు ముందడుగు వేస్తారన్నారు. జాతీయ భావన విద్యార్థి దశనుంచే అలవర్చుకోవాలని సూచించారు. జవాన్లు తిమ్మప్ప, గోవింద్‌, అత్తార్‌బాషా, బీజేపీ నాయకులు నవీనచౌదరి, హరీ్‌షరెడ్డి, శాంతకుమార్‌, రాజేష్‌, కుళ్లాయప్ప పాల్గొన్నారు.

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

అనంతపురం ఎడ్యుకేషన: రామ్‌నగర్‌లోని నారాయణ పాఠశాలలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివ్‌సను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సైనిక వేషధారణల్లో దేశభక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ దేశానికి సైనికదళం చేస్తున్న సేవలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం రమే్‌షబాబు, ప్రిన్సిపాల్‌ హనుమంతరెడ్డి, కోఆర్డినేటర్‌ రెడ్డి హరిత, ఏఓ నయాజ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విక్టోరియా, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:20 AM