divotional చవితి సందడి..
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:29 AM
వినాయక చవితి పండుగ శనివారం జరగనుండడంతో పట్టణంలో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రజలు పూజాసామగ్రితో పాటు సరుకులు కొ నుగోలు చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
- పండుగ, పూజాసామగ్రి కొనుగోలుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
- పట్టణాల్లో కిక్కిరిసిన మార్కెట్లు, దుకాణాలు
తాడిపత్రి ,సెప్టెంబరు 6: వినాయక చవితి పండుగ శనివారం జరగనుండడంతో పట్టణంలో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రజలు పూజాసామగ్రితో పాటు సరుకులు కొ నుగోలు చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
స్థానికులే కాకుండా.. గ్రామాల ప్రజలు సైతం భారీగా వచ్చి వచ్చారు. వినాయకప్రతిమలు, మామిడి, అరటి ఆకులు, కూరగాయలు, పూలు, పండ్లు, నిత్యావసర సరుకులు తదితరాల కొనుగోలుకు దుకాణాల వద్ద క్యూ కట్టారు. దీంతో స్థానిక కూరగాయల మార్కెట్‌తోపాటు పోలీ్‌సస్టేషన సర్కిల్, యల్లనూరురోడ్డు సర్కిల్ తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి. పెద్ద పెద్ద ప్రతిమలను ఉత్సవాల నిర్వాహకులు వివిధ వాహనాల ద్వారా ఎంతో ఉత్సాహంగా మండపాలకు తరలించారు. దీంతో సందడి నెలకొంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..