Share News

PARITALA SUNITHA: యూనివర్సిటీలో రాజకీయాలు ఉండరాదు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:22 AM

ఎస్‌కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు.

PARITALA SUNITHA: యూనివర్సిటీలో రాజకీయాలు ఉండరాదు
SKU registrar honoring MLA Paritala Sunitha

రామగిరి, జూలై 26: ఎస్‌కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు. శుక్రవారం రిజిసా్ట్రర్‌ వెంకటాపురంలో ఎమ్మెల్యే పరిటాలసునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె రిజిసా్ట్రర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులకు మెరుగైన విద్య అందిచడంతోపాటు సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. యూనివర్సిటీలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఉండదరాదని, అసలు రాజకీయాలకే చోటు ఉండకూడదన్నారు. అందరూ కష్టపడి యూనివర్సిటీకి మంచిపేరు తీసుకురావాలని ఆమె సూచించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:22 AM