Alluri Sitaramaraj : మన్యం వీరుడికి ఘన నివాళి
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:39 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అల్లూరి 127వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరిలాంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. అణగారిన వర్గాలు, గిరిజనుల సంక్షేమానికి ...
అనంతపురం టౌన, జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అల్లూరి 127వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరిలాంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. అణగారిన వర్గాలు, గిరిజనుల సంక్షేమానికి ఆయన చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు. రాష్ట్రంలోని రంపచోడవరం,
పార్వతీపురం తదితర గిరిజన ప్రాంతాలలో తాను పనిచేశానని, అల్లూరి తిరిగిన ప్రాంతాలను సందర్శించానని అన్నారు. ప్రతి ఒక్కరూ అల్లూరి స్ఫూర్తితో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరపాలిక కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్వో రామకృష్ణారెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు రామాంజినేయులు, కుష్బూ కొఠారి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....