Share News

ప్రజాధనం వృథా

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:02 AM

గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్లక్ష్యం వల్ల కేవలం మండలంలోనే రూ. లక్షల ప్రజాధనం నిరుపయోగమైంది. మండల వ్యాపంగా పలు పంచాయతీల్లో గత వైసీపీ ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా సరిహద్దురాళ్లు వేయించింది.

	  ప్రజాధనం వృథా
బొల్లుగుంట్లపల్లి వద్ద వృథాగా పడేసిన సరిహద్దురాళ్లు

గాండ్లపెంట, జూలై 7: గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్లక్ష్యం వల్ల కేవలం మండలంలోనే రూ. లక్షల ప్రజాధనం నిరుపయోగమైంది. మండల వ్యాపంగా పలు పంచాయతీల్లో గత వైసీపీ ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా సరిహద్దురాళ్లు వేయించింది. నాటి పాలకులు భూరక్ష, భూ హక్కు పథకంలో భాగంగా పలు గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహిం చారు. కమతంపల్లి, మద్దివారిగొంది. జీన్లకుంట, సామచేనుబైలు, మడుగువారిగొందిలో రీసర్వేలో భాగంగా అరకొరగా రికార్డుల్లో అడంగల్‌ మార్చారు. రైతుల పొలాల వద్ద అరకొరగా సరిహద్దురాళ్ల నాటి చేతులు దులుపుకున్నారు. మరికొన్ని పంచాయతీలైన గాండ్లపెంట, వేపరాల, కురమామిడి పంచాయతీల్లోనూ అరకొరగానే సర్వే చేశారు.


భూముల్లో సరిహద్దు రాళ్లు కుప్పలు... కుప్పలు ఇలా వేశారు. ఈ సర్వే రాళ్లపై వైఎస్‌ఆర్‌ జగనన్న అనే పేరును ముద్రించారు. ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. పథకాన్ని సక్రమంగా అమలు చేయడంపై వైసీపీ పాలకులు చూపకపోవడంపై... తద్వారా ప్రజాథనం వృథా కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:02 AM