Share News

పెన్షనర్ల దెబ్బేంటో జగనకు చూపిస్తాం

ABN , Publish Date - May 09 , 2024 | 12:30 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెన్షనర్ల దెబ్బేంటో జగనకు రుచి చూపిస్తామని, వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షు డు పాళంకి సుబ్బరాయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దన గౌడ్‌ తేల్చిచెప్పారు.

పెన్షనర్ల దెబ్బేంటో జగనకు చూపిస్తాం
మాట్లాడుతున్న ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాళంకి సుబ్బరాయన

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే 8: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెన్షనర్ల దెబ్బేంటో జగనకు రుచి చూపిస్తామని, వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షు డు పాళంకి సుబ్బరాయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దన గౌడ్‌ తేల్చిచెప్పారు. బుధవారం ఆంధ్రా పెన్సనర్స్‌ పార్టీ ఎన్నికల ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక ఓ ప్రముఖ హోటల్‌లో పెన్సనర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఐదేళ్ల జగన పాలనలో పెన్షనర్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఈ ఐదేళ్ల పాలనలో ఏ పెన్షనర్‌ ఒకటో తేదీన పెన్షన తీసుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ పెన్షనర్ల జీవితాలు నాశనమయ్యాయన్నారు. రివర్స్‌ పీఆర్సీ, డీఏల పెండింగ్‌, అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన ఎత్తేసి ఇలా పలు రకాలుగా పెన్షనర్లను నానా రకాలుగా ఇబ్బం దులకు గురిచేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక ఇబ్బందులున్నా... సమయానికి పింఛనలు, అలవె న్సులు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అలాంటి చంద్రబాబును కాదని ఒక్క ఛాన్స అంటే జగనకు ఓటేశామని, ఫలితంగా ఐదేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారని వాపోయారు. ఇప్పుడు అవకాశమొచ్చిందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని గెలిపించాలని యాత్ర చేపట్టామని అన్నారు.


కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మాట్లాడుతూ.... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒకటో తేదీన పెన్షన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో ‘సీనియర్‌ సిటిజన్సగా రాష్ర్టాన్ని కాపాడుకోవడం మన బాధ్యత’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీఎ్‌సఎన మూర్తి, కోశాధికారి టీ నాగభూషణం, జాయింట్‌ సెక్రటరీ కే వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌. జయరామప్ప, జిల్లా కన్వీనర్‌ డి. ప్రభాకర్‌, సీనియర్‌ సిటిజన్స అధ్యక్షుడు ఎం. వెంకటరమణ, పెన్షనర్ల సంఘం జిల్లా కోశాధికారి డి. రామకృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:30 AM