Share News

Mukesh Kumar Meena: ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు..ఆ తర్వాత శాంతిభద్రతలు పరిరక్షించాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 08:07 AM

2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) చివరి ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. ఈ క్రమంలో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(mukesh kumar meena) లేఖ రాస్తూ అధికారులు, ప్రజలకు కీలక ఆదేశాలను వెలువరించారు.

 Mukesh Kumar Meena: ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు..ఆ తర్వాత శాంతిభద్రతలు పరిరక్షించాలి
ceo Mukesh Kumar Meena

2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) చివరి ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. ఈ క్రమంలో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(mukesh kumar meena) ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి లేఖ రాస్తూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన అందరినీ అభినందించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల కృషిని అభినందిస్తూ సీఈవో లేఖ రాశారు.


ఏపీ(ap)లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్(polling) జరిగిందని ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. అన్నింటి కంటే మించి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఈసారి ఎంతో ఉత్సాహాన్ని చూపారని వెల్లడించారు. ఇక ఇప్పుడు చివరిదైన ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకుందని చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తరువాత రోజు కూడా అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీసులను కోరారు.


దీంతోపాటు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదైనా ఆటంకాలు తలెత్తితే వాటిని నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. కౌంటింగ్(counting) రోజున ఎన్నికల నిబంధనలను ఎవరైనా పాటించడంలో విఫలమైన వారిని ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రాజకీయంగా కీలకమైన ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బంది కలిగించేవారిపై ముందు నుంచే నిఘా ఉంచాలన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో అసత్య వార్తలు, పుకార్లను వెంటనే ఖండించాలన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సంఘటనలపై ఉన్నతాధికారులు(officers), ఈసీఐ, ప్రెస్/మీడియా, రాజకీయ పార్టీలతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని సీఈఓ సూచించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలను కాపాడుకోవడంలో అందరూ ముందుండాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:

Ap Election Survey :లోకమంతా ఒకవైపు.. జగన్‌ మరోవైపు!


Andhra Pradesh :శ్రీశైలంలో సరిహద్దుల పోరు

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 08:08 AM