Share News

Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వొద్దంటూ అధికారులకు ఆదేశాలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:55 PM

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే పాలనపై దృష్టి సారించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా పనిలో నిమగ్నమయ్యారు. తమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు్న్నారు

Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వొద్దంటూ అధికారులకు ఆదేశాలు

అమరావతి: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే పాలనపై దృష్టి సారించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా పనిలో నిమగ్నమయ్యారు. తమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు్న్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ, పశుసంవర్ధక శాఖ ముఖ్య అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సైతం పాల్గొన్నారు.


ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా చూడాలంటూ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందేలా చూడాలని ఆదేశించారు.ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే పీఎం కిసాన్ యోజన తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో అచ్చెన్నాయుడు చర్చించారు. ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Updated Date - Jun 15 , 2024 | 01:55 PM