MP Sri Bharath: యూఎస్ అధ్యక్షుడుగా ఎవరు వచ్చినా..
ABN , Publish Date - Nov 18 , 2024 | 08:54 PM
ఇండో - అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో యూఎస్ బిజినెస్, టూరిజం వీసాపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విశాఖపట్నం, నవంబర్18: వీసా ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్ల పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. అలాంటి వారి కోసం వీసాపై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో యూఎస్ బిజినెస్, టూరిజం వీసాపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: Maharashtra Elections: మహాయుతిదే విజయం
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. యూఎస్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వీసా అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని తెలుగు వారంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నారు. అయితే అమెరికా దేశాధ్యక్షుడిగా ఎవరు వచ్చినా.. యూఎస్, భారత్ మధ్య బంధం బలపడుతూనే ఉందని గుర్తు చేశారు.
Also Read: Vemuri Radha Krishna: తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది
ఈ నేపథ్యంలో ఈ ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఎంపీ శ్రీభరత్ ఆకాంక్షించారు. వ్యాపార, పర్యాటక వీసా ప్రక్రియపై యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఇండో - అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
Also Read: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి యూఎస్ వచ్చే వారిపై ఇకపై కఠిన ఆంక్షలు ఉండబోతున్నాయంటూ ఓ ప్రచారం అయితే సాగుతుంది. దీనిపై యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు
Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?
దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా వీసాలు, ట్రంప్ నిర్ణయాలు తదితర అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే.
Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం
Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి
ఇక కెనడ, భారత్ మధ్య సంబంధాలు కొంత ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్నాయి. దీంతో కెనడలోని భారతీయులు సైతం స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయనే ఓ చర్చ సైతం సాగుతుంది. అంతేకాకుండా.. భారత్ నుంచి కెనడా వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News