Guntur: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. పోలీస్ కస్టడీకి నందిగం సురేష్
ABN , Publish Date - Sep 13 , 2024 | 06:21 PM
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు: టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సురేష్‌ను ఈ నెల 15 నుంచి 17 వరకు మధ్యాహ్నం 1 వరకు జైల్లోనే విచారించనున్నారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దాడులు జరిగాయి. సురేష్.. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సురేష్‌ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 5వ తేదీన మంగళగిరి రూరల్ పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో పోలీసులు మంగళగిరి కోర్టును ఆశ్రయించారు. 8 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
సుప్రీంలో విచారణ..
టీడీపీ ఆఫీసుపై, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగిరమేశ్(Jogi Ramesh), అవినాశ్ (Avinash) ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో(Sureme Court) విచారణ జరిపింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీం స్పష్టం చేసింది. 48 గంటల్లో పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నిందితుల ముందస్తు బెయిల్‌పై నవంబర్ 4న సుప్రీం తేల్చనుంది. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించగా... దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు ధర్మాసనం మధ్యంతర రక్షణ కల్పించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
For Latest News and National News click here