‘అపార్’కు నోటరీ, అఫిడవిట్ అవసరం లేదు
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:13 AM
జిల్లాలో 1-12 తరగతులు చదువుతున్న విద్యార్థుల అపార్ ఐడీకి జనన ధ్రువీకరణపత్రం జారీ చేసేనిమిత్తం నోటరీ, అఫిడవిట్లు అవసరంలేకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో కేవీఎస్ కుమార్ తెలిపారు.
హెచ్ఎం/ఎంఈవోల లేఖ, ఎస్సెస్సీ సర్టిఫికెట్లతో జారీకి కలెక్టర్ ఆదేశం
తిరుపతివిద్య, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1-12 తరగతులు చదువుతున్న విద్యార్థుల అపార్ ఐడీకి జనన ధ్రువీకరణపత్రం జారీ చేసేనిమిత్తం నోటరీ, అఫిడవిట్లు అవసరంలేకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో కేవీఎస్ కుమార్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల డిక్లరేషన్/హెచ్ఎం/ ఎంఈవోల లేఖ, ఎస్‌ఎ్‌ససీ మార్కుల జాబితా మేరకు కొత్త ఆధార్ఐడీ నమోదు, ఆధార్‌కార్డులలో తేడాలను సకాలంలో సరిచేసి అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటినుంచి తొమ్మిది తరగతులు చదివే విద్యార్థులకు ఆధార్‌లో పేరు సవరించేందుకు ఆయా హెచ్ఎంలు, ప్రైవేట్ పాఠశాలల్లో అయితే తనిఖీ అధికారి నుంచితెచ్చిన డిక్లరేషన్‌తో సరిచేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ఆధార్‌లో పుట్టినతేదీ సవరణకు వీఆర్వో లేదా వైద్యశాఖ లేదా మున్సిపల్ అధికారులు జారీచేసిన జననధ్రువీకరణపత్రం ఆధారంగా, ఇంటర్ విద్యార్థులకు పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా సవరించేలా కలెక్టర్ చర్యలు చేపట్టారని వివరించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయ సెక్రటరీలు, వీఆర్వోలు పైఆదేశాలను పాటించి విద్యార్థులపై ఒత్తిడిలేకుండా చూడాలని ఒక ప్రకటనలో కోరారు.