Share News

sand smuggling ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:32 AM

తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకే్‌షకుమార్‌ మీనా వర్చువల్‌ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.

sand smuggling ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 26: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకే్‌షకుమార్‌ మీనా వర్చువల్‌ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. వీసీ తర్వాత అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. నూతన ఇసుక విధానం అమలుకు ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీలోని సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఎడ్లబండిపై అక్రమంగా ఇసుక రవాణా చేసినా జరిమానా విధించాలని ఆదేశాలిచ్చారు. డీఆర్వో పెంచలకిషోర్‌, అడిషనల్‌ ఎస్పీ వెంకట్రావు, సెబ్‌ అదనపు ఎస్పీ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:10 AM