Share News

inter bokks ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలు వచ్చేశాయోచ్‌!

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:42 AM

ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్‌ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్‌ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

inter bokks ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలు వచ్చేశాయోచ్‌!
చిత్తూరు జిల్లాకు చేరిన పుస్తకాలు

వైసీపీ హయాంలో ఇచ్చింది ఒక్కసారే

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 26: ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్‌ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్‌ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

వైసీపీ పాలనలో ఇలా..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 2020-21 విద్యా సంవత్సరంలో మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించారు. ఆ తర్వాత ఉచితానికి మంగళం పాడారు. ఇది విద్యార్థుల పాలిట శాపంగా వరిఇంది. గత నాలుగేళ్లలో ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 55 శాతం మించలేదు. 2008 నుంచి 2013 వరకు పుస్తక ప్రసాదం కింద టీటీడీ పుస్తకాల ముద్రణకు నిధులు ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం ఇంటర్‌ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. 2021-22 సంవత్సరంలో పుస్తకాల ముద్రణపై స్పష్టత కొరవడటంతో పుస్తకాలు అందే పరిస్థితి కనిపించలేదు. జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో స్టాక్‌ ఉన్న కొన్ని పుస్తకాలను ఆ ఏడాది మాత్రం అరకొరగా విద్యార్థులకు పంపిణీ చేసి అప్పటి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. దీంతో మూడేళ్లుగా ఉచిత పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులకు ఎదురు చూపులు తప్పలేదు. దీంతో తాము బోధించిన పాఠ్యంశాల్లో విద్యార్థులకు తలెత్తే సందేహాలను ఏ మేరకు నివృత్తి చేసుకోగలరన్న ఆందోళన అధ్యాపకులను వెంటాడింది. 2020-21 ఫలితాలు ప్రథమ ఇంటర్‌లో 51 శాతం కాగా, 2023-24 వరకు ఇదే దోరణి కొనసాగింది. మరో పక్క పుస్తకాలు లేకుండా తమ పిల్లలు ఎలా చదువుకోవాలన్న ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ వ్యక్తమైంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ముద్రించినా, అవి బహిరంగ మార్కెట్‌కు అందించి సొమ్ము చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సైతం బహిరంగ మార్కెట్‌లో కొనాల్సి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర నెలలోనే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది.

గ్రూపులు ఇలా..

ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, హెచ్‌ఎల్‌సీ (హిస్టరీ-లాజిక్‌-సివిక్స్‌), ఒకేషనల్‌ ఇలా 27 గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులోనూ ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషు మీడియంతో పాటు హిందీ, తమిళం, ఉర్దూ, సంస్కృతం లాంగ్వేజీలున్నాయి.

41,450 మంది విద్యార్థులు.

జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో మొదటి, ద్వితీయ సంవత్సరంలో 41,450 మంది విద్యార్థులు చదువుతున్నారు. యాజమాన్యాల వారీగా.. 31 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 23 వేల మంది, ఏపీ రెసిడెన్షియల్‌లో 2418 మంది, 8 కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో 1484 మంది, 7 ఏపీ మోడల్‌ స్కూల్‌ల్లో 4061 మంది, 19 హైస్కూల్‌ ప్లస్‌లో 3487 మంది, ఒకేషనల్‌ గ్రూపులో 7 వేల మంది చదువుతున్నారు. వీరికి అవసరమైన కిట్లు అందించనున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:42 AM