Share News

ప్రశాంతంగా నీట్‌

ABN , Publish Date - May 06 , 2024 | 01:50 AM

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎ్‌సఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంసె్‌స) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం జరిగిన జాతీయ స్థాయి పరీక్ష నీట్‌ యూజీ-2024 ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా నీట్‌

- 97.37 శాతం విద్యార్థుల హాజరు

తిరుపతి(ఉపాధ్యాయనగర్‌), మే 5: అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎ్‌సఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంసె్‌స) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం జరిగిన జాతీయ స్థాయి పరీక్ష నీట్‌ యూజీ-2024 ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి పరిదిలోని తొమ్మిది కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 97.37 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్‌ కైలా్‌షనాథ్‌ తెలిపారు. మొత్తం 4,692 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 4,569 మంది హాజరయ్యారు. 105 మంది గైర్హాజరయ్యారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల ప్రకారం పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు.

కేంద్రాల వారీగా హాజరు

ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో 774 విద్యార్థులకుగాను 730 మంది హాజరయ్యారు. అలాగే గీతం స్కూల్లో 600మందికిగాను 580 మంది, ఎడిఫై స్కూల్లో 600 మందికిగాను 586 మంది, ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంలో 600 మందికిగాను 585 మంది, లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్లో 504 మందికిగాను 496 మంది, విశ్వం పాఠశాలలో 504 మందికిగాను 494 మంది, మార్గ్‌ చిన్మయ విద్యాలయలో 432 మందికిగాను 419 మంది, శ్రీవిద్యానికేత్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో 384 మందికిగాను 370 మంది, శ్లోక బిర్లా స్కూల్‌లో 324 మందికిగాను 309 మంది పరీక్ష రాశారు.

Updated Date - May 06 , 2024 | 01:50 AM