Share News

Come- వచ్చేశామోచ్‌!

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:42 AM

నేలపట్టుకు వలస విహంగాల రాకడ మొదలైంది. సాధారణంగా అక్టోబరు తొలివారంలోనే రావలసిన ఈ పక్షులు కొంత ఆలస్యంగా వచ్చాయి. అయిదు రోజులుగా నేలపట్టు చెరువుల్లోని కడపచెట్ల మీద తెల్ల కొంగలు సందడి చేస్తున్నాయి.

Come- వచ్చేశామోచ్‌!
నేలపట్టు చెరువులోని కడపచెట్లపై పక్షులు

- కాస్త లేటైంది..అంతే

ఫ నేలపట్టుకు మొదలైన విదేశీ విహంగాల రాకడ

నేలపట్టుకు వలస విహంగాల రాకడ మొదలైంది. సాధారణంగా అక్టోబరు తొలివారంలోనే రావలసిన ఈ పక్షులు కొంత ఆలస్యంగా వచ్చాయి. అయిదు రోజులుగా నేలపట్టు చెరువుల్లోని కడపచెట్ల మీద తెల్ల కొంగలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది వానలు ఆలస్యం కావడంతో ఈ విదేశీ అతిథులు ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెట్టాయి. నత్తగుల్ల కొంగలు, పెలికాన్‌లతో పాటూ తెల్లకంకణాయి(వైట్‌ఐబీ్‌స)లు 245 వచ్చాయి. నీటికాకులు (లిటిల్‌ కార్మోరెంట్స్‌) 53, చుక్కమూతి బాతులు (స్పాట్‌ బిల్డ్‌ డక్స్‌ 4, డాబ్‌చిక్స్‌ 2 విడిదిలో ప్రస్తుతం ఉన్నాయి. పక్షుల సందడి మొదలవడంతో నేలపట్టుకు సందర్శకులను అనుమతిస్తున్నారు.

సందర్శన వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

నేలపట్టుకు తొలి అతిథులు నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్‌). ఇప్పటికే 805 పక్షలు ఇక్కడికి చేరుకున్నాయి.

పెలికాన్‌ ప్యారడైజ్‌

నేలపట్టుకు పెలికాన్‌ ప్యారడైజ్‌ అనే పేరు రావడానికి కారణం ఇవే! ఈ గూడబాతుల రాక సోమవారం నుంచీ మొదలైంది. ఇప్పటికి 122 గూడబాతులు నేలపట్టులో వాలాయి. ఇక రోజూ గుంపులు గుంపులుగా వస్తాయి. వేల సంఖ్యలో నేలపట్టులో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రిక దేశాల నుంచి ఇవి ఎక్కువగా నేలపట్టుకు చేరుకుంటాయి. చెరువుల్లోని చెట్లపై కట్టుకున్న గూడుల్లో చేరి, జతకట్టి, గుడ్లుపెట్టి, పిల్లల్ని చేస్తాయి. ఆ పిల్లలకు రెక్కలోచ్చేదాకా పులికాట్‌ నుంచి చేపలు తెచ్చి తినిపిస్తాయి. రెక్కల్లో బలం వచ్చాక వెంట తీసుకుని ఎగిరిపోతాయి. - దొరవారిసత్రం, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 24 , 2024 | 01:42 AM