Share News

coconut కొబ్బరికాయల వ్యాపారి కిడ్నాప్‌ సుఖాంతం

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:21 AM

తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్‌ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్‌ అయ్యాడు

coconut కొబ్బరికాయల వ్యాపారి కిడ్నాప్‌ సుఖాంతం

భాకరాపేట/తిరుపతి(నేరవిభాగం),జూలై 26: తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్‌ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్‌ అయ్యాడు.తన కుమారుడు రెడ్డికిరణ్‌కు వాట్సప్‌ కాల్‌ చేసి తాను కిడ్నాపర్ల చెరలో వున్నట్లు తెలియ జేశాడు.రెడ్డికిరణ్‌ వెంటనే భాకరాపేట పోలీసులకు కిడ్నాప్‌ విషయం తెలిపాడు.రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ నెంబరు ఆధారంగా కిడ్నాపర్లు వెళుతున్న వాహనం లొకేషన్‌ను గుర్తించి పీలేరు సమీపంలో వెంబడించారు.పోలీసుల రాకను గుర్తించిన నలుగురు కిడ్నాపర్లు వారి వాహనాన్ని ఢీకొట్టి తిరుపతి వైపు పారిపోతుండగా చంద్రగిరి మండలం కాలూరు క్రాస్‌ వద్ద మరో పోలీసు బృందం కిడ్నాపర్లను అటకాయించింది.ఇదే సమయంలో కిడ్నాపర్ల వాహనం టైరు పంక్చర్‌ కావడంతో పోలీసులకు దొరికిపోయారు.కిడ్నాపర్ల ముఠాలో చిన్నగొట్టిగల్లుకు చెందిన జిషామ్‌తో పాటు బెంగళూరుకు చెందినవారున్నారని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగుతో కిడ్నాపర్లకు సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి తిరుచానూరు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదై భాకరాపేట పోలీసులకు బదిలీ చేయబడింది.ఎస్పీ సుబ్బరాయుడి పర్యవేక్షణలో భాకరాపేట సీఐ మస్తాన్‌వలి, ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఐ ఈశ్వరయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:21 AM