Share News

CPI: రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడారు..: నారాయణ

ABN , Publish Date - Aug 09 , 2024 | 11:35 AM

తిరుపతి: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి.. పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు.

 CPI: రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడారు..: నారాయణ

తిరుపతి: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతి (Tirupati)లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన (Land lost) బాధితులందరూ (Victims) బయటకు వచ్చి.. పెద్దిరెడ్డి పై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు. పెద్దిరెడ్డి భూదందాలపై జ్యుడీషియల్ విచారణ (Judicial Inquiry) జరగాల్సిన అవసరం వుందన్నారు.


కేరళలోని వయనాడ్‌లో జరిగిన ఘటన బాధాకరమని, ప్రకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారని నారాయణ విచారం వ్యక్తం చేశారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేరళ ఘటనపై ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా..మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బంగ్లాదేశ్‌లో అవినీతి, అహంభావం పెరిగిందని, ప్రజాస్వామ్యాన్ని షేక్ హసీనా చంపేశారని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరు సరైందేనని, బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం లాంటిదన్నారు.


పలు రాష్ట్రాల్లోని గవర్నర్‌లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు అప్పుగానే ఇస్తోందని, ప్రత్యేక హోదా కావాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తే సరిపోదని..నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీకి వెళ్ళకుండా ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్ళారని..? నారాయణ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం చేయాలే తప్ప పనికిమాలిన పనులు చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో రాబోయే ఏ ఎన్నికలైనా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో పెడితే మంచిదని నారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఐదేళ్లూ.. దుర్భరం

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయాలు ఇవే..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 11:35 AM