Share News

శ్రీకాళహస్తిలో 3250 చీరల సీజ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:54 AM

శ్రీకాళహస్తిలో వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధం చేసిన 3250 చీరలను అధికారులు సీజ్‌ చేశారు. ఆటో డ్రైవరుతో పాటు ముగ్గురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో 3250 చీరల సీజ్‌
శ్రీకాళహస్తిలోని గోదాములో చీరల మూటలను పరిశీలిస్తున్న సీఐ రారాజు

శ్రీకాళహస్తి, మే 8:శ్రీకాళహస్తిలో వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధం చేసిన 3250 చీరలను అధికారులు సీజ్‌ చేశారు. ఆటో డ్రైవరుతో పాటు ముగ్గురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రారాజు కథనం మేరకు... శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని చెంచులక్ష్మి కాలనీ రోడ్డులో వున్న ఓ గోదాంలో కొందరు చీరలను భారీగా నిల్వ చేసి ఆటోలో తరలించేందుకు సిద్ధమయ్యారు.స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రారాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆటోతో సహా రాజీవ్‌ నగర్‌ కాలనీ చెందిన ఉదయ్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం అధికారులకు సమాచారం అందించారు. 13 పార్సిల్‌ మూటల్లో 3250 చీరలున్నట్లు నిర్ధారించారు.వైసీపీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి సన్నిహితులైన సలీం, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు బుల్లెట్‌ జయశ్యాం, మాజీ సభ్యుడు మున్నా తనను చీరలు తరలించమని చెప్పినట్లుగా ఆటో డ్రైవర్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ ప్రకారం ముగ్గురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రారాజు తెలిపారు.

రేణిగుంటలో వైసీపీ యధేచ్చగా చీరలు పంపిణీ

రేణిగుంటలో వలంటీర్ల సహకారంతో బుధవారం డబ్బు, చీరలను వైసీపీ నాయకులు పంపిణీ చేశారు.రాత్రి వేళల్లో వీధిదీపాలను ఆఫ్‌ చేయించి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జీఎం వీధిలో వైసీపీకి చెందిన మహిళలు చీరలు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్‌ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా చీరలు పడేసి పరారయ్యారు.దీంతో ఒక బ్యాగులో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:54 AM