Share News

జగన్‌ పాలనలో కరెంటు బిల్లుల బాదుడే బాదుడు

ABN , Publish Date - May 09 , 2024 | 12:43 AM

విద్యుత్‌ బిల్లులు చూసి వినియోదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్‌, ఈడీ(ఎలక్ర్టిసీటీ డ్యూటీ) పేరిట సుమారు రూ.575 కోట్ల మేర ప్రజల నుంచి ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది. యూనిట్‌కు కొంత మొత్తం నిర్ణయించి విడతల వారీగా వడ్డిస్తోంది. ట్రూ అప్‌ చార్జీల పేరిట 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో వినియోగించిన విద్యుత్‌కు ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టింది. తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.35 నుంచి రూ.40 ప్రతినెలా వసూలు చేస్తున్నారు. సర్‌చార్జీల పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినెలా రూ.150 అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

 జగన్‌ పాలనలో కరెంటు బిల్లుల బాదుడే బాదుడు

చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన భాస్కర్‌ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2018లో రూ.175 వచ్చే కరెంటు బిల్లు 2024లో రూ.1,980 వచ్చింది. యూనిట్లేమో తక్కువగా ఉన్నాయి. బిల్లు మాత్రం పది రెట్లు పెరిగింది. వచ్చే కూలి కరెంటు బిల్లులకు సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

చిత్తూరు రూరల్‌ మండలం అనంతాపురానికి చెందిన మార్కొండకు గతంలో ప్రతినెలా రూ.200 నుంచి రూ.250 మధ్య కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.500 దాటుతోంది. సగానికి సగం పెరిగింది. ట్రూఆప్‌, ఫిక్స్‌డ్‌ ఛార్జీలంటూ బిల్లుల్లో చాలానే కనిపిస్తున్నాయి. వాడిన కరెంటు కన్నా అదనపు ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయి.

చిత్తూరు నగరానికి చెందిన మణి వృత్తి రీత్యా రజకుడు. బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో ఆయనకు నెలకు రూ.600 విద్యుత్‌ బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.1,300 దాటుతోంది. నెల సంపాదన కరెంటు బిల్లుకే సరిపోతోందని ఆవేదన చెందుతున్నాడు.

చిత్తూరు రూరల్‌, మే 6: విద్యుత్‌ బిల్లులు చూసి వినియోదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్‌, ఈడీ(ఎలక్ర్టిసీటీ డ్యూటీ) పేరిట సుమారు రూ.575 కోట్ల మేర ప్రజల నుంచి ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది. యూనిట్‌కు కొంత మొత్తం నిర్ణయించి విడతల వారీగా వడ్డిస్తోంది. ట్రూ అప్‌ చార్జీల పేరిట 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో వినియోగించిన విద్యుత్‌కు ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టింది. తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.35 నుంచి రూ.40 ప్రతినెలా వసూలు చేస్తున్నారు. సర్‌చార్జీల పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినెలా రూ.150 అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

ఫరూ.6 పైసల నుంచి రూపాయి వరకు...

టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులకు ఈడీ కింద యూనిట్‌కు రూ.6 పైసలు వసూలు చేసేవారు. ఈ మొత్తం ప్రభుత్వానికే వెళుతుంది. వైసీపీ సర్కార్‌ వచ్చాక గృహ సర్వీసులకు రూ.6 పైసలు అట్లాగే ఉంచినా వాణిజ్య, పరిశ్రమల సర్వీసులకు యూనిట్‌కు రూపాయి చేసింది. ఇలా పెంచినప్పటి నుంచి సదరు సర్వీసులకు రూ.75 కోట్లు అదనంగా భారం పడింది.

ఫ ఫిక్స్‌డ్‌ ఛార్జీల పేరుతో..

టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ సర్వీసులకు పిక్స్‌డ్‌ ఛార్జీలు ఉండేవి కావు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ సర్వీసులకు సంబంధించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. సగటున ఫిక్స్‌డ్‌ ఛార్జీల రూపేణా అదనంగా రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు రూ.17 కోట్లకు పైగా వినియోగదారుల నుంచి విద్యుత్‌ శాఖ వసూలు చేసింది.

ఫ ఐదేళ్లలో రూ.575 కోట్లు భారం

వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచింది. దాంతో వదిలిపెట్టకుండా సర్దుబాటు పేరిట వినియోగదారులు షాక్‌ తినేలా చేశారు. గృహ కనెక్షన్లకు సంబంధించి చాలా మంది వినియోగదారులు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లలో వినియోగదారులపై రూ.575 కోట్లు అదనంగా భారం పడింది.

ఉమ్మడి జిల్లాలో..

విద్యుత్‌ సర్వీసుల వివరాలిలా...

గృహ సర్వీసులు: 13.73 లక్షలు

పరిశ్రమలు :31 వేలు

వాణిజ్యం : 1.62 లక్షలు

ప్రభుత్వ సర్వీసులు : 46 వేలు

గ్రామీణ నీటి సరఫరా : 14 వేలు

హెచ్‌టీ సర్వీసులు : 1,920

మొత్తం : 19.55 లక్షలు

ఫ టీడీపీ ప్రభుత్వంలో ఎంత వాడితే అంతే కట్టేవారు...

2018లో టీడీపీ ప్రభుత్వంలో వినియోగదారులు వాడిన యూనిట్లతోపాటు అదనంగా విద్యుత్‌ సుంకం రూ.4.50 మాత్రమే వసూలు చేసేవారు. దీంతో బిల్లు భారంగా మారేది కాదు. పైగా ఎంతవాడితే అంత బిల్లు చెల్లిస్తున్నారు కాబట్టి బాధ ఉండేది కాదు. 75 యూనిట్లకు రూ.240 వచ్చేది. ఇందులోనూ కస్టమర్‌ చార్జీలు 40, చార్జీ 195, సుంకం రూ.4.5 ఉండేది.

ఫ వైసీపీ ప్రభుత్వంలో అదనపు ఛార్జీలే ఎక్కువ..

వైసీపీ ప్రభుత్వంలో వినియోగదారుడు వినియోగించుకున్న విద్యుత్‌ కన్నా అదనపు ఛార్జీలే ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. వినియోగదారుడు 62 యూనిట్లు వాడితే బిల్లు రూ.153 రావాలి. అయితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.80. కస్టమర్‌ ఛార్జీలు రూ.30, ఎలక్ర్టిసిటీ డ్యూటీ రూ.3.72, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు 69.60, సర్‌ ఛార్జీలు రూ.25, ట్రూఅప్‌ ఛార్జీలు రూ.26.97 అంటే అదనంగా బిల్లు కన్నా రూ.235 వసూలు చేస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:43 AM