Share News

AP Elections 2024: డామిట్‌.. పులివెందులే పలకడంలా!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:34 AM

‘పులివెందుల’ చిత్రం మారుతోంది! ‘కో’ అంటే కోటిమంది, ‘రా’ అంటే లక్ష మంది వచ్చేస్తారనుకుని బరిలోకి దిగిన జగన్‌ శిబిరానికి అక్కడ చిత్రమైన అనుభవం ఎదురవుతోంది. ‘ప్రచారానికి రాండిబ్బా’ అని పిలిస్తే... ‘పొలం పని ఉందన్నా’ అని స్థానిక నేతలు మెల్లగా జారుకుంటున్నారు.

AP Elections 2024: డామిట్‌.. పులివెందులే పలకడంలా!

  • అవినాశ్‌ ప్రచారానికి దూరందూరం

  • పొలం పని పేరుతో కాలక్షేపం

  • లింగాల మండలంలోనే మారిన సీన్‌

అమరావతి, ఆంధ్రజ్యోతి: ‘పులివెందుల’ చిత్రం మారుతోంది! ‘కో’ అంటే కోటిమంది, ‘రా’ అంటే లక్ష మంది వచ్చేస్తారనుకుని బరిలోకి దిగిన జగన్‌ (YS Jagan Mohan Reddy) శిబిరానికి అక్కడ చిత్రమైన అనుభవం ఎదురవుతోంది. ‘ప్రచారానికి రాండిబ్బా’ అని పిలిస్తే... ‘పొలం పని ఉందన్నా’ అని స్థానిక నేతలు మెల్లగా జారుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌ గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు.


పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామాల్లో కొంతమేర పట్టున్న నేతలకు ఒకరోజు ముందే కబురు పెట్టారు. లింగాల మండలంలోని పెదకూడల, చినకూడల, గునకనపల్లె, లోపటినూతల, తాతిరెడ్డిపల్లి, కర్ణపాపాయ పల్లె గ్రామాల నేతలతో ఆయన నేరుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. అందరూ పొలం బాట పడుతున్నట్లు చెప్పారు. దీంతో వాస్తవమేంటో కనుక్కురమ్మని అవినాశ్‌రెడ్డి కొందరు అనుచరులను పంపారు.


దాదాపు అన్ని గ్రామాల్లోనూ వైసీపీ నేతలు చీనీ చెట్లలో కూర్చుని పేకాట ఆడుతున్న దృశ్యాలు వారికి కనిపించాయి. మరికొందరు అరటి తోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ కనపడ్డారు. ఎందుకిలా అని ఆరా తీస్తే... ‘రాష్ట్రంలో వాళ్లే(టీడీపీ) గెలుస్తున్నారంట! గవర్నమెంట్‌ లేనప్పుడు పులివెందుల్లో మనం చేసేది ఏముందిలే! అయినా ఇప్పుడు అధికారంలో ఉండీ ఏం చేస్తున్నాం గనుక!’ అని ముఖానే చెప్పేశారట.


వైఎస్‌ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కోట అయితే... లింగాల మండలం కంచుకోట! 1996లో కడప లోక్‌సభ స్థానంలో బరిలో నిలిచిన వైఎస్‌ను లింగాల మండలమే గెలిపించింది. అటువంటి మండలంలోనే ఇప్పుడు సీన్‌ మారిపోవడం గమనార్హం. వివేకా హత్య, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం, ఐదేళ్లూ తమను పట్టించుకోకపోవడం వంటి కారణాలవల్లే జగన్‌ క్యాంప్‌కు స్థానిక నేతలు దూరంగా జరుగుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వార్తల కోసం

Vijayawada Politics: ‘బెజవాడ’ బ్రదర్స్‌.. బాహాబాహీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 18 , 2024 | 10:38 AM