Share News

జిల్లాలో 30శాతం వరి కోతలు పూర్తి

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:45 AM

జిల్లాలో 1.57లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేపట్టగా ఇప్పటి వరకు 48వేల ఎకరాల్లో వరి కోతలు 30శాతం పూర్తి అయిన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు తెలిపారు.

 జిల్లాలో 30శాతం వరి కోతలు పూర్తి

అంబాజీపేట, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1.57లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేపట్టగా ఇప్పటి వరకు 48వేల ఎకరాల్లో వరి కోతలు 30శాతం పూర్తి అయిన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు తెలిపారు. పొలం పిలుస్తొంది కార్యక్రమంలో భాగంగా వక్కలంక గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసే పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు మాట్లాడుతూ జిల్లాలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు, కె.గంగవరం, ద్రాక్షారామ, రావులపాలెం, ఆత్రేయపురం తదితర మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి జిల్లాలో 4.32లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా 377ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈకొనుగోలు కేంద్రాల ద్వారా 4.32లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం కాగా 43,400మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉంచా మన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు ధాన్యం విక్రయించిన 48గంటల్లో రైతు ఖాతాకు నగదు జమచేస్తామన్నారు. గోనె సంచులు కొరత ఉన్న కేంద్రాల్లో ముందస్తుగా సమాచారం అందిస్తే ఆయా మిల్లర్ల ద్వారా సంచులు ఏర్పాటు చేయి స్తామన్నారు. రబీ సాగుకు సంబంఽధించి జిలాల్లో 1.72లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారన్నారు. రబీలో తెగుళ్లను తట్టుకునేందుకు 1121, బొండాలు, ఎంసీ-13 రకాల సాగు చేయాలన్నారు. ఈనెలాఖరు నాటి నుంచి రబీకీ నారుమడులు సిద్ధం కావాలని రైతులకు సూచించారు. వాతావరణ మార్పుల కారణంగా కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ధాన్యం కోసిన రైతులు వాటిని వెంటనే ఒబ్బిడి చేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలన్నారు. వక్కలంకలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన గుత్తుల ఽధర్మరావు రైతు క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఏవో సీహెచ్‌డీ విజయకుమార్‌, హార్టీకల్చర్‌ విస్తరణాధికారి డి.వెంకటేశ్వరరావు, ఏడీవో డి.దుర్గారావు, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:45 AM