Share News

అరాచక పాలనను అంతమొందించాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:18 AM

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్మోహనరెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్స్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్‌ వింగ్‌ సభ్యులు కొండయచౌదరి, కిరణ్‌కుమార్‌, సతీష్‌, నవీన్‌, ప్రసన్న, రాంబాబు తదితరులు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి చేరుకున్నారు.

అరాచక పాలనను అంతమొందించాలి

  • కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

కొవ్వూరు, మే 8: రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్మోహనరెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్స్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్‌ వింగ్‌ సభ్యులు కొండయచౌదరి, కిరణ్‌కుమార్‌, సతీష్‌, నవీన్‌, ప్రసన్న, రాంబాబు తదితరులు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావలిసిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ క్రమంలో వింగ్స్‌ సభ్యులు బుధ వారం కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలి శారు. కార్యక్రమంలో అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ, నాదెళ్ళ శ్రీరామ్‌, ఆళ్ల హరిబాబు, మద్దిపట్ల సురేష్‌ పాల్గొన్నారు. అలాగే కొవ్వూరులో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఇంటింటికీ వెళ్లి కూటమి మేనిఫెస్టోను బొట్టుపెట్టి ప్రచారం చేశారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జొన్నలగడ్డ రాధారాణి స్థానిక అచ్చాయమ్మకాలనీలో కూటమికి పట్టం కట్టాలని ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకు సైకిల్‌ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పొట్రు తులసీ ధనలక్ష్మి, గద్దె రేణుక, జె.గీతాకుమారి, పి.ఉషారాణి, ఎ.ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:18 AM