Share News

‘ప్రతీ సమస్యను పరిష్కరించాలి’

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:02 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 17: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతీఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9.30 నుంచి 10.30 గం టల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్య

‘ప్రతీ సమస్యను పరిష్కరించాలి’

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 17: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతీఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9.30 నుంచి 10.30 గం టల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమాన్ని, అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో 11 వినతులు స్వీకరించారు. ఎస్‌ఈ సత్యకుమారి, స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ వెంకటరావు, ఈఈ మాధవి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, డీసీపీ హరిదాస్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ,ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ శిరిల్‌ ఉన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 12:02 AM