Share News

జిల్లాలో 1577 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - May 09 , 2024 | 01:34 AM

జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

జిల్లాలో 1577 పోలింగ్‌ కేంద్రాలు

మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపునకు ఏర్పాట్లు

పోలింగ్‌బూత్‌ల వారీగా భద్రతకు సిబ్బంది నియామకం

జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్‌

ఎన్నికల పరిశీలకులతో సమీక్షా సమావేశం

దివాన్‌చెరువు, మే 8: జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఆవరణలో ఎన్నికల సాధారణ పరిశీలకులు పోలింగ్‌ ముందు రోజున, పోలింగ్‌ రోజున (ఈ నెల 12,13 తేదీల్లో) అనంతరం స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీ లకులు కె.బాలసుబ్రహ్మ ణ్యం, కమల్‌కాంత్‌ సరోచ్‌, పోలీస్‌ పరిశీకుడు బలరాం మీనాలకు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రత ఏర్పాట్లు, అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై కలెక్టర్‌, ఎస్పీ వివరించారు. పోలింగ్‌ అనంతరం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్‌ యూని ట్లను నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయా నియోజ కవర్గాల స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, అందుకు అనుగు ణంగా లెక్కింపు కోసం టేబుల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్‌ ప్రత్యేక మార్గాలు ఉన్నాయని కలెక్టర్‌ చెప్పారు. ఎస్పీ పి.జగదీష్‌ మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాలు, మూడు పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 1513 పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత సిబ్బందిని, ఇతర అను బంధశాఖల ఉద్యోగులను నియమించినట్టు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా భద్రతా ఏర్పాట్లు విషయమై కార్యాచరణ వివరిం చారు. అనంతరం ఎన్నికల పరిశీ లకులు లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు తీరును పరిశీలించారు. ఇందుకోసం సిబ్బందిని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు సేవలందిస్తారని చెప్పారు.

ఓటర్లకు భద్రత కల్పించడమే ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

రాజమహేంద్రవరం, మే 8(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో 8మంది ట్రైనీ ఐపీ ఎస్‌లను జిల్లాకు కేటాయించారు. నియోజకవర్గాల్లో పలు బాధ్యతలను వారు పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణ గురించి ఎస్పీ జగ దీశ్‌ వారికి వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవ డానికి భద్రత కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహించాలని చెప్పారు. అవాంఛ నీయ సంఘనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని సూ చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలన్నారు. నియ మా వళిలోని నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించడానికి వీల్లేదని ఎస్పీ చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 01:34 AM