రాత్రివేళల్లో చిరుత సంచారం
ABN , Publish Date - Sep 15 , 2024 | 12:28 AM
దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా
త్వరలోనే పట్టుకుంటాం : డీఎఫ్‌వో భరణి
దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నారన్నారు. చిరుత కదలికలను గుర్తించేందుకు 50 ట్రాప్ కెమెరాలు, ిసీసీ కెమెరాలతో బాటు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే నాలుగు ట్రాప్ బోనులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నివాసప్రాంతాల వారు వారి ఇంటి పరిసరాలలో చెత్త వేయవద్దని కోరారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. రాత్రివేళల్లోనే చిరుతపులి సంచరిస్తోందని పగలు దాని కదలికలు ఉండడంలేదన్నారు. జాతీయ రహదారికి దివాన్‌చెరువు-లాలాచెరువు మధ్య రెండుప్రక్కలా అడవి ఉందని అందుచే పోలీస్‌లతో బాటు, తమ సిబ్బంది కంట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ముందు జాగ్రత్తగా కొన్నిచర్యలు చేపట్టామని తెలిపారు. ట్రాప్ బోనువద్దకు చిరుతపులి రాకపోవడానికి గల కారణాలపై ప్రశ్నించగా దానికి అవసరమైన ఆహారం సమృద్దిగా బయటే లభిస్తోందని అన్నారు. చిరుతపులి ట్రాప్‌బోను ప్రక్కకు వస్తోందని అన్నారు. అందులో ఏమి ఉందన్న విషయం కుడా ప్రయత్నిస్తోందని చెప్పారు. సహజ అటవీ ప్రాంతంలో ట్రాప్‌బోను కృత్రిమ వస్తువు అన్నారు. దాని పై నమ్మకం కుదిరితే అదిట్రాప్‌బోనులో ప్రవేశిస్తుందని అన్నారు. అపుడు చిరుతపులిని పట్టుకోవచ్చని చెప్పారు. దీని ప్రకారమే చేస్తున్నామన్నారు. ఎక్కడైనా చిరుత కదలికలపై అనుమానాలు ఉంటే తెలిపితే తమసిబ్బంది అక్కడకు వచ్చి పరిశీలిస్తారని అన్నారు. అయిుతే అసత్యప్రచారాలు, నకిలీవార్తలు వ్యాప్తి చేయవద్దని కోరారు. చిరుతపులి కదలికలను తెలుసుకునేందుకు వనరులయాజమాన్యం ఎంతో ముఖ్యమని చెప్పార అత్యవసర పరిస్ధితులలో వినియోగించెకునేందుకు వీలుగాథర్యల్‌డ్రోన్ అందుబాటులో ఉంచుకుని సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు.