Home » Rajahmundry City
దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.
Janasena Candidates: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు..
Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్ తగ్గినట్టు అయింది..
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై (Chandrababu Health) కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుకున్నదే అక్షరాలా నిజమైంది.! ఇన్నిరోజులూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు రోజువారీగా హెల్త్ బులెటిన్ (CBN Health Report) ఇచ్చినప్పటికీ అదంతా పచ్చి అబద్ధమేనని.. అభూత కల్పన అని తేలిపోయింది..
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్రకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) ఆరోగ్యంపై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక నివేదికను రిలీజ్ చేశారు. గత మూడ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆయన మెడికల్ రిపోర్టుల్లో ఏం తేలింది..? అనే కీలక విషయాలను నివేదికలో వైద్యులు నిశితంగా వివరించారు..
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో కలిశారు.