Share News

AP Elections: పెరిగిన పోలింగ్.. నేతల్లో టెన్షన్.. ఓటరు మాత్రం కూల్..

ABN , Publish Date - May 14 , 2024 | 07:27 PM

ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్‌4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.

AP Elections: పెరిగిన పోలింగ్.. నేతల్లో టెన్షన్.. ఓటరు మాత్రం కూల్..
TDP and YSRCP

ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్‌4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది. ఓటర్లు మాత్రం స్పష్టమైన తీర్పునిచ్చినట్లు పోలింగ్ సరళి చూస్తుంటే తెలుస్తుంది. ఓటరు నాడిని పట్టుకోవడం పోలింగ్ రోజు వరకు ఎవరి తరం కాలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటరు ఎవరికి ఓటు వేసింది బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ.. ఓటింగ్ సరళి చూసినప్పుడు మాత్రం ఓటరు తీర్పు స్పష్టంగానే ఉందన్న విషయాన్ని రాజకీయ పండితులు పసిగట్టినట్లు తెలుస్తోంది.


ఏ నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేయాలో ఓటరు ముందే డిసైట్ అయి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన తీర్పును రిజర్వ్ చేశారనేది స్పష్టం. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓటరు తీర్పు విభిన్నంగానూ ఉండనుంది. పోలింగ్ ముందు రోజు వరకు ఓ పార్టీ అభ్యర్థి గెలుస్తారని అంచనా వేసినప్పటికీ.. పోలింగ్ తీరు ఆధారంగా ఆ నియోజకవర్గాల్లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం మారడంలో డబ్బుల పంపిణీ కీలకంగా పనిచేసిందనే చర్చ లేకపోలేదు.

AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..


ఆ స్థానాల్లో అంతా రివర్స్..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పోలింగ్‌కు 2 రోజుల ముందు వరకు ఓటరు నాడి ఓ రకంగా ఉండగా.. పోలింగ్ రోజు మాత్రం ఊహించిన దానికి భిన్నంగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈనియోజకవర్గంలో పోల్ మేనేజ్‌మెంట్‌లో అధికారపార్టీ సక్సెస్ అయిందని.. ప్రత్యర్థి పార్టీ అనుకున్నంతగా పోల్ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయిందట. దీంతో ఇక్కడి ఫలితం ఎలా ఉంటుందనేది జూన్‌4న తేలనుంది. ఈ ఒక్కనియోజకవర్గమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరో రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. రాజమండ్రి సిటీలో రెండు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ నియోజకవర్గంలో వన్‌సైడ్ పోలింగ్ జరిగిందని.. అధికార పార్టీ అభ్యర్థి అనుకున్నంత పోటీ ఇవ్వలేకపోయారనే ప్రచారం ఉంది. మండపేట నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన గట్టిపోటి నడిచినప్పటికీ.. పోల్ మేనేజ్‌మెంట్‌లో అధికారపార్టీ ఫెయిల్ అయిందని, టీడీపీ అభ్యర్థి పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా చేసుకోవడంతో ఇక్కడ అనుకున్నదానికంటే ఎక్కువ మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందనే చర్చ జరగుతోంది.


నేతల్లో టెన్షన్..

పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళి ఆధారంగా వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు అంచనా వేయడం మొదలుపెట్టారు. పైకి తమకే మెజార్టీ సీట్లు వస్తాయని చెబుతున్నప్పటికీ.. అధికారపార్టీకి అనుకున్నంత పాజిటివిటీ లేదని, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేపినట్లు స్పష్టమైందని, దానికి సంకేతమే రాత్రి వేళ కూడా భారీ క్యూలైన్లో నిల్చుని ఓటు వేయడమని చాలామంది అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జనసేన ఓటు కలవడంతో కూటమికి విజయవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని సంకేతాలు వెలువడటంతో అధికారపార్టీ నేతల్లో టెన్షన్ కొనసాగుతూనే ఉందట. మరోవైపు ఎన్డీయే కూటమి ఆశించినట్లు ఎమ్మెల్యే సీట్లలో భారీ అధిక్యం రానప్పటికీ విజయానికి కావాల్సిన సీట్లు వస్తాయని, కూటమికి 110 నుంచి 120 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ ముందుగా ఊహించినట్లుగా 150 నుంచి 160 సీట్లు రావడం కష్టమని, వృద్ధులు, మహిళల్లో ఎక్కువమంది అధికారపార్టీ వైపు మొగ్గుచూపారని దీంతో 50 నుంచి 60 సీట్ల వరకు వైసీపీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.


AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 14 , 2024 | 07:27 PM