Share News

AP Election 2024: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

ABN , Publish Date - May 14 , 2024 | 01:33 PM

నిన్న ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓటేయడానికి జనం పోటెత్తారు. ప్రభంజనంలా తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

AP Election 2024: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

అమరావతి: నిన్న ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓటేయడానికి జనం పోటెత్తారు. ప్రభంజనంలా తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ (Mukhesh Kumar Meena) మీనా వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు అయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా వేశారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో 79.4 శాతం నమోదైందన్నారు. మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయని వెల్లడించారు. మా అంచనా ప్రకారం 81+ శాతం పోలింగ్ నమోదు కావచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ఇవి కూడా చదవండి...

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 03:23 PM