Share News

కాపులను మోసం చేసిన జగన్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:55 AM

పెద్దాపురం, మే 8: కాపులను మోసం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ అని కాపు జేఏసీ కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. స్థానిక సుధా కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ముద్రగడ కు కాపు జేఏసీకి ఎటువంటి సంబంధం లేదని, ముద్రగడ సొంతంగా ముందుకు

కాపులను మోసం చేసిన జగన్‌

జేఏసీ కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు

పెద్దాపురం, మే 8: కాపులను మోసం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ అని కాపు జేఏసీ కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. స్థానిక సుధా కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ముద్రగడ కు కాపు జేఏసీకి ఎటువంటి సంబంధం లేదని, ముద్రగడ సొంతంగా ముందుకు వెళ్తున్నారిని... ఆయనకు కాపులకు సంబంధం లేదన్నారు. కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయాలతో పోరాటం సాగిస్తున్నారన్నారు. కాపు జేఏసీ సామాజిక వర్గ ప్రయోజనాలకే పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో కాపుల మద్దతు టీడీపీ కూటమికే అని తెలిపారు. చంద్రబాబు కాపులకు 5 శా తం రిజర్వేషన్లు కేటాయిస్తే జగన్‌ రద్దు చేశారన్నారు. పెద్దాపు రం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మకాయల చినరాజప్పకే తమ మద్దతు అని ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘వైసీపీని ఓడించాలి’

కిర్లంపూడి, మే 8: కాపులకు వెన్నుపోటు పొడిచిన వైసీపీని ఓడించాలని కాపు నాయకులు పేర్కొన్నారు. బుధవారం మం డలంలోని బూరుగుపూడి గ్రామంలో మాజీ ఎంపీటీసీ పాటంశెట్టి రవి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపు జేఏసీ నాయకత్వంలో ఉద్య మం చేసి సాధించుకున్న ఫలాలు నేడు కాపు కులాలకు అం దకుండా పోతున్నాయన్నారు. ప్రధాన మోదీ కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనేనని పార్లమెంటు సాక్షిగా చెప్పినా జగన్‌ ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఆలోచిం చి ఓటేయాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాపు రాష్ట్ర జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్‌, వేమన శ్రీనివాసరావు, ములగాల శ్రీనివాసరావు, సిద్ద నూకరాజు, సురేష్‌నాయుడు, కూరాకుల చినబాబు, త్రినాధరావు, తిరుమల రావు, బావిశెట్టి ప్రసాద్‌, యర్రంశెట్టి సాయిబాబు, గోపిశెట్టి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:55 AM