‘నేత్ర దానంపై విస్తృత అవగాహన’
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:33 PM
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 30: నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అంధ త్వ నివారణా సంస్థ, బాదం బాలకృష్ణ ఐ బ్యాంకులు సంయుక్తంగా ప్రచురించిన నేత్రదాన అవగాహన పోస్టర్లు
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 30: నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అంధ త్వ నివారణా సంస్థ, బాదం బాలకృష్ణ ఐ బ్యాంకులు సంయుక్తంగా ప్రచురించిన నేత్రదాన అవగాహన పోస్టర్లును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వేలమంది కార్నియల్ అంధులు కంటి చూపులేక చీకటిలోనే ఉండిపోతున్నారనీ వారికి వెలుగులు నింపేందుకు మరణానంతరం నేత్రదానం చేయాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమం ఈనెల 25వతేదీ నుంచి సెప్టెంబర్ 8వతేదీ వరకు నిర్వహిస్తున్నారన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ, దామెర విజయలక్ష్మీ, దాసరి సాయికృష్ణ, పైడా సోమేశ్వరరావు, నానాజీ పాల్గొన్నారు.