Share News

కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షం

ABN , Publish Date - May 09 , 2024 | 12:57 AM

కాకినాడ సిటీ, మే 8: వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విజనరీ లీడర్‌ చంద్రబాబు కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాకినాడ సిటీ అసెం

కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు

కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు

కాకినాడ సిటీ, మే 8: వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విజనరీ లీడర్‌ చంద్రబాబు కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 29వ డివిజనలో ఆయన పర్యటించి కూటమి ప్రభుత్వం అందించే సూపర్‌సిక్స్‌ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర, అవినీతి, అచారక, డ్రగ్స్‌ గంజాయి, రౌడీ గుండాల పాలన నుంచి కాకినాడను కాపాడుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. అక్రమ సంపాదన కోసం కాకినా డను గంజాయి నగరంగా మార్చి యువత భవిష్యత్తు నాశనం చేశారన్నారు. దేశంలోనే రాష్ట్రం వైసీపీ పాలనలో అభివృద్ధిలో ఆఖరి స్థానం, వినాశనంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు చారిత్రక అవసరం కాను ందన్నారు. యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర పురోగతికి కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆవశ్యమని తెలిపారు. పరిశీలకుడు కేతా శ్రీనివాసరావు, డివిజన్‌ నాయకులు అమలకంటి బలరామ్‌, పినిశెట్టి శ్రీనివాస రావు, సిరియాల రాము, చింతలపూడి రవి, యాళ్ల రామకృష్ణ, గంజి గోపి, కె.వీర నాగమణి, జి.మంగ దుర్గ పాల్గొన్నారు.

పలు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం

పలు డివిజన్లలో అభ్యర్థి వనమాడి కొండబాబు కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడు వనమాడి సత్యనారాయణ కుటుంబసభ్యులు విస్తృతంగా ఎన్నికల ప్రచాచం చేశారు. 13వ డివిజన్‌లో వనమాడి హేమంత్‌కుమార్‌, 8వ డివిజన్‌లో వనమాడి శివప్రసాద్‌, 21వ డివిజన్‌లో వనమాడి సుష్మారేఖ, 24వ డివిజన్‌లో వనమాడి కుసుమాంజలి విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్‌ ్స సంక్షేమ పఽథకాల కరపత్రాలను పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. డమ్మీ బ్యాలెట్‌ పేపర్‌లను పంపిణీ చేశారు.

కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబును సైకిల్‌ గుర్తుపైన, కాకినాడ పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని తిరుమలకుమార్‌ 30వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రంధి బాబ్జి, బచ్చు శేఖర్‌, అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్‌, బొబ్బిలి గోవిందు, సీమకుర్తి మురళి, కోరుపూడి లలిత, వైకుంఠరావు, శ్రీనివాస్‌, జనసేన నాయకుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:57 AM