Share News

కాకినాడలోని పురాతన కట్టడాలను సంరక్షించుకోవాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:46 AM

కాకినాడ నగరంలోని పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్‌మెన్‌ ఆఫ్‌ ఇండియా రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు.

కాకినాడలోని పురాతన కట్టడాలను సంరక్షించుకోవాలి

రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌

జేఎన్టీయూకే, జూలై 26: కాకినాడ నగరంలోని పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్‌మెన్‌ ఆఫ్‌ ఇండియా రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. వర్సిటీలోని సెనేట్‌ హాల్లో జేఎన్టీయూకే, పీడబ్ల్యూసీడీఎఫ్‌ సంస్థల ఆధ్వర్యంలో వారసత్వ సంపద భవిష్యత్తు, కార్యాచరణ అనే అంశంపై శుక్రవారం నగర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి చీఫ్‌ ఇంజనీర్‌ వి.శ్రీనివాసులు, పీడబ్ల్యూసీడీఎఫ్‌ సమన్వయకర్త పి.ఆదినారాయణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాజేంద్రసింగ్‌ , విశిష్ట అతిథిగా ఇన్‌ఛార్జి వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ, గౌరవఅతిథులుగా సామాజిక కార్యకర్త, జనసేన పార్టీ సీనియర్‌ నేత బొలిశెట్టి సత్యనారాయణ, సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, పర్యావరణవేత్తలు రత్నం, మృత్యుంజయరావు పాల్గొన్నారు. రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ కాకినాడలో పురాతన కళాశాలలు, జాతీయ వారసత్వ సంపద, మడ అడవులు ఉన్నాయన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ వర్శిటీలో 75ఏళ్లు దాటిన అతిపెద్ద వృక్షాలున్నాయని, వాటిని సంరక్షించేందుకు ప్రతిఏటా పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మడ అడవుల్లోని ప్రతిజీవి వారసత్వ సంపదేనని తెలిపారు. సత్యనారాయణ మాట్లాడుతూ మడ అడవులు, హోప్‌ ఐలాండ్‌వల్ల కాకినాడ నగరం సంరక్షింపబడుతోందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ కేవీరమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, ఓఎస్డీ కోటేశ్వరరావు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:46 AM