Share News

మద్యం తాగి వాహనాలు నడిపిన 9మందికి జైలుశిక్ష

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:28 AM

సర్పవరం జంక్షన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు వాహనదారులకు న్యాయమూర్తి తలో రూ.10 వేలు జరిమానా విధించినట్టు సర్పవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే.శ్రీనివాస్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వ

మద్యం తాగి వాహనాలు నడిపిన 9మందికి జైలుశిక్ష

కాకినాడ క్రైం, జూలై 26: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిదిమంది వాహనదారులకు రెండేసి రోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాకినాడ సిటీ పరిధిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌-1, 2 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనదారులకు డ్రంక్‌ అ ండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. 14 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని ట్రా ఫిక్‌ పోలీసులు కాకినాడ మూడో స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా 9మ ందికి 2రోజుల జైలుశిక్ష విధిస్తూ జడ్జి వి.నరసింహారావు తీర్పునిచ్చారు. మిగతా ఐదుగురికి తలో రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్టు ట్రాఫిక్‌ సీఐలు చైతన్యకృష్ణ, రమేష్‌ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ముగ్గురు వాహనదారులకు జరిమానా

సర్పవరం జంక్షన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు వాహనదారులకు న్యాయమూర్తి తలో రూ.10 వేలు జరిమానా విధించినట్టు సర్పవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే.శ్రీనివాస్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించగా ముగ్గురు వాహనదారులు మద్యంతాగి బైక్‌లు నడుపుతున్నట్టు నిర్థారించడం జరిగిందన్నారు. వారిని సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా జడ్జి నరసింహం ఒక్కొ క్కరికీ రూ.10వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:28 AM