Share News

మహిళపై గొడ్డలితో దాడి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:55 AM

పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మహిళపై గొడ్డలితో దాడి

తీవ్రంగా గాయపడ్డ మహిళ

సరిహద్దు గోడ వివాదమే కారణమా

గొల్లప్రోలు, జూలై 26: పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని రంగప్పచెరువు వీధిలో వాటర్‌ట్యాంకు ఎదురుగా నేకూరి రాజ్యలక్ష్మి తన భర్త, కుమారులతో కలిసి అద్దె ఇంటిలో నివాసముంటున్నది. వీరికి సమీ పాన వేమగిరి రాజేష్‌ అతని తల్లితో కలిసి ఉంటున్నాడు. వాళ్లింటిని ఎడమవైపున రాజ్యలక్ష్మి కుటుంబానికి ఖాళీస్థలం ఉంది. ఈ స్థలం లోకి వచ్చి గోడ కట్టుకున్నారంటూ రాజేష్‌కు. రాజ్యలక్ష్మి కుటుంబానికి మధ్య వివాదం కొంతకాలంగా ఉంది. ఈ విషయంలో పెద్దమనుషుల్లో పెట్టగా గోడను సరిచేసుకోవాలని వారు రాజేష్‌కు సూచించారు. దీంతో రాజేష్‌ కక్ష పెంచుకుని అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. భర్త వ్యవసాయ పనులకు వెళ్లి రాజ్యలక్ష్మి ఇంటి వద్ద బయ ట టీ పెట్టుకుంటున్నది. దీనిని గమనించి రాజేష్‌ తన తల్లి లక్ష్మీతో ఆమె వద్దకు వెళ్లి అకస్మాత్తుగా గొడ్డలితో తలపై, శరీరంపై పలుచోట్ల విచక్షణా రహితంగా నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్న ఆమెను తొలుత పిఠాపురం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చికి త్స నిమిత్తం తరలించారు. కాగా రాజేష్‌ ఇదే తరహాలో నాలుగేళ్ల క్రితం తన మేనమామ ద్రాక్షారపు భూషణంపై దాడి చేయగా దీనిపై కేసు నమోదైంది. మహిళపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, గొల్లప్రోలు ఎస్‌ఐ జాన్‌భాషాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాత్రి రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రు.

Updated Date - Jul 27 , 2024 | 12:55 AM