Share News

చెత్త నుంచి సంపద కార్యక్రమానికి శ్రీకారం

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:43 PM

పిఠాపురం రూరల్‌, ఆగస్టు 28: చెత్త నుంచి సంపద కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ఆయన పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో బుధవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు గృహాల్లో ఉండే వ్యర్థాలను రో జూ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ సిబ్బందికి అందజేయాలన్నా

చెత్త నుంచి సంపద కార్యక్రమానికి శ్రీకారం
ఎఫ్‌కేపాలెంలో చెత్తసేకరణ వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్‌

సాలిడ్‌ వేస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్‌

పిఠాపురం రూరల్‌, ఆగస్టు 28: చెత్త నుంచి సంపద కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ఆయన పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో బుధవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు గృహాల్లో ఉండే వ్యర్థాలను రో జూ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ సిబ్బందికి అందజేయాలన్నారు. వారు తడి, పొడి చెత్తగా వేరు చేసి వాటి నుంచి వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువుల త యారీ, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో ప్రారంభించారని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఎఫ్‌కేపాలెం నుంచి శ్రీకారం చుడుతున్నామని, త్వరలో నియోజకవర్గమంతా విస్తరిస్తామని తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాన్ని పరిశీలించి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసన్‌, గ్రామసర్పంచ్‌ ముమ్మిడి మహాలక్ష్మి, జనసేన నాయకులు పిల్లా శ్రీధర్‌, శివశంకర్‌, జవ్వాది జోగేశ్వరరావు, బీజేపీ నేత జి.కొండలరావు ఉన్నారు.

సామూహిక వరలక్ష్మి వ్రతాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ

పిఠాపురం, ఆగస్టు 28: పట్టణంలోని పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి. ఉమాకుక్కుటేశ్వరస్వామి చెంత కొలువైన రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠానికి అధిష్టాన దేవతయిన పుర్హుతికాఅమ్మవార్ల సన్నిధిలో జరగనున్న ఈవ్రతాలను 4 బ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు. 6మందికి పైగా మహిళలు పూజల్లో పాల్గొనేలా దేవదాయశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్రతాలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి హాజరవుతారని చెబుతున్నారు. కాగా వ్రతాల ఏర్పాట్లు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. మహిళా భక్తులకు ఏ ఆసౌకర్యం క లగకుండా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. దేవదాయశాఖ సహాయ కమిషనరు, ఈవో దుర్గాభవానీ, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌,నాయకులు ఉన్నారు.

ఇదిలా ఉండగా పూజలు చేసుకునే మహిళలకు అందించేందుకు పసుపు కుంకుమ, చీరలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తన సొంత నిధులతో పంపించారు. మొత్తం 12వేల చీరలు పంపగా, వీటిలో 6వేల చీరలను పాదగయ క్షేత్రంలో, పూజాది కార్యక్రమాలు అనంతరం మరో 6వేల చీరలను చేబ్రోలులోని పవన్‌ నివాసం వద్ద వాటిని మహిళల కు అందజేయనున్నట్టు జనసేన వర్గాలు తెలిపారు.

Updated Date - Aug 28 , 2024 | 11:43 PM