Share News

హత్యకేసులో తండ్రితో సహా కుమారులకు యావజ్జీవ శిక్ష

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:53 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి ఆర్‌.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు.

హత్యకేసులో తండ్రితో సహా  కుమారులకు యావజ్జీవ శిక్ష

ద్రాక్షారామ, జూలై 26 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి ఆర్‌.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు. ద్రాక్షారామ ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యనమదల గ్రామానికి చెందిన దారా అప్పారావుకు చెందిన పాడె గేదెలు సాదె జనార్థనరావుకు చెందిన భూమి సరిహద్దులోకి వెళ్లి మొక్కలు పాడుచేస్తున్న విషయమై ఇరువురికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2015 సెప్టెంబరు 6న మధ్యాహ్నాం 2 గంటలకు సాదె జనార్థనరావుకు చెందిన స్థలంలోకి దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారాచంటి, దారా రాజశేఖర్‌లు కత్తులు, కర్రలతో అక్రమంగా ప్రవేశించి సరిహద్దులో కర్రల దడిపాడు చేసి సాదె జనర్థానరావుకు చెందిన చింతచెట్టును నరికి పాడు చేస్తుండగా సాదె జనార్థనరావు అతని కుమారులు వెళ్లి దౌర్జన్యంపై ప్రశ్నించగా దారా సింహాద్రి కత్తితో సాదె జనార్థనరావును మెడ వెనుక చావరా అంటూ నరికాడు. దీంతో సాదె జనార్ధనరావు రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సాదె జనార్ధనరావు రెండవ కుమారుడు దుర్గాప్రసాద్‌ ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ కె.వంశీధర్‌ కేసు నమోదు చేయగా సీఐ పి.కాశీవిశ్వనాధం కేసు దర్యాప్తుచేసి సాక్ష్యాధారాలతో చార్జిషీటు దాఖలు చేశారు. రాజమహేంద్రవరం 10వ ఏడీజే ఎస్సీ, ఎస్టీ కోర్టు లో స్పీడ్‌ ట్రయల్‌ నిర్వహించగా నేరం రుజువు కావడంతో నింది తులు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5వేలు చొప్పన జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసులో కేసు నమోదుచేసిన ఎస్‌ఐ వంశీధర్‌, సీఐ పి.కాశీవిశ్వనాధరావు, స్పీడ్‌ ట్రయల్‌ నందు కృషి చేసిన ఎస్‌ఐ జి.సురేంద్రను ఎస్‌పీ బి.కృష్ణారావు అభినందించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:53 AM